Home » ఓటీటీలోకి లారెన్స్ రుద్రడు.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే ?

ఓటీటీలోకి లారెన్స్ రుద్రడు.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే ?

by Anji
Ad

రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. డ్యాన్స్ మాస్టర్ గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, హీరోగా, నటుడిగా ఇలా సినిమాలలో ఆయన చేయని వర్క్ లేదు. దాదాపు అన్నింటిలో ఆరితేరిన వారిలో లెరెన్స్ ఒకరు. చాలా రోజుల తరువాత లారెన్స్ హీరోగా నటించిన చిత్రం రుద్రుడు. కతిరేశన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో లారెన్స్ కి జోడిగా ప్రియా భవానీ శంకర్  నటించింది. శరత్ కుమార్ విలన్ పాత్రలో కనిపించాడు.

Also Read :   అఖిల్ కు హిట్ రాకపోవడానికి కారణం జాతక దోషమే వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!!

Advertisement

Advertisement

 

తమిళంలో రుద్రన్ పేరుతో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో రుద్రుడు పేరుతో ఏప్రిల్ 14న విడుదల అయింది. మాస్ ఆడియెన్స్ ని లక్ష్యాంగా పెట్టుకొని రూపొందించిన రుద్రుడు మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కొంత మేరకు విజయం సాధించింది. లారెన్స్ మార్క్ డైలాగ్ లు, ఫైట్లు మాస్ ఫ్యాన్స్ ని మెప్పించాయి. ఈ మూవీ థియేటర్లలో ఓ మోస్తారుగా మెప్పించింది. కానీ ఇప్పుడు డిజల్ స్ట్రీమింగ్ సిద్ధం అయింది. రుద్రుడు సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ కొనుగోలు చేసింది. మే 12 లేదా 19 ఏదో ఒక తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మే మొదటి వారంలో అధికారికంగా రుద్రుడు  ఓటీటీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. 

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రుద్ర ఐటీ ఉద్యోగిగా పని చేస్తుంటాడు. అయితే రుద్ర ఫ్యామిలీపై పగ పెంచుకున్న విలన్ శరత్ కుమార్ అతని భార్యతో రుద్ర ఫ్యామిలీపై పగ పెంచుకున్న విలన్ శరత్ కుమార్ అతని భార్యతో పాటు తల్లిని దారుణంగా Haత్య చేస్తాడు. ఈ మర్డర్స్ రుద్ర జీవితంపై ఎలాంటి ప్రభావం చూపాయి. అతనిపై రుద్ర ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే ఈ సినిమా కథాంశం. సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు రుద్రుడు సినిమాను తెలుగులో విడుదల చేశారు. 

Also Read :  హీరోలలో అందరికన్నా మంచివాడు ప్రభాస్.. దర్శకుడు తేజ ఏమన్నారంటే..?

Visitors Are Also Reading