Home » చిరంజీవి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన 7 క్రేజీ ప్రాజెక్ట్ లు ఇవే…!

చిరంజీవి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన 7 క్రేజీ ప్రాజెక్ట్ లు ఇవే…!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి ఇండియాలోని స్టార్ హీరోల లిస్టులో ఒకరుగా ఉన్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో మెగాస్టార్ ఈ స్థాయికి ఎదిగారు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తన కష్టంతోనే చిరు మెగా ప్రపంచాన్ని సృష్టించారు. తన కెరీర్ లో చిరంజీవి 150కి పైగా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. చిరు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ కొన్ని క్రేజీ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం…

chiru-movies-stopped

chiru-movies-stopped

చిరంజీవి హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో భూలోక దొంగ సినిమాను మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా కథలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని గుర్తించి మధ్యలోనే డ్రాప్ అయ్యారు.

Advertisement

చిరంజీవి హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో అబూ బాగ్దాద్ గజదొంగ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఇండియాలోని అన్ని భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ విడుదల చేయాలని అనుకున్నారు. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కు బడ్జెట్ ఎక్కువ అవుతుందన్న నేపథ్యంలో మధ్యలోనే ఆగిపోయింది.

Advertisement

వామ్మో.. షూటింగ్ మధ్యలోనే చిరంజీవి సినిమాలు ఇన్ని ఆగిపోయాయా | Chiranjeevi Halted Movies ,chiranjeevi, Vinalani Undi, Bhuloka Veerudu, Abu Baghdad Gajadonga, Auto Jani, Chiranjeevi Cine Career ...

చిరంజీవి హీరోగా రామ్ రెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు బ్రేక్ పడింది.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా కూడా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది.

చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత 150వ చిత్రంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ అనే సినిమాను అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా కూడా ఎందుకో వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో చిరు ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చాడు.

టాలీవుడ్ లో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు తీసిన డైరెక్టర్ ఆదిత్యతో చిరంజీవి ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది.

ఆర్జీవీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా టబూ, ఊర్మిళ హీరోయిన్లుగా వినాలని ఉంది అనే టైటిల్ తో సినిమా ను అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా కొన్ని కారణాలవల్ల మధ్యలోనే ఆగిపోయింది

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !

Visitors Are Also Reading