Home » వన్డేలో మూడో హ్యాట్రిక్ అందుకుఆ కుల్దీప్ యాదవ్..!

వన్డేలో మూడో హ్యాట్రిక్ అందుకుఆ కుల్దీప్ యాదవ్..!

by Azhar
Ad
భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. ప్రస్తుతం టీం ఇండియాలో చోటు కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. ధోని ఉన్నన్ని రోజులు ఇండియా జట్టులో చెలరేగిన కుల్దీప్ యాదవ్.. తర్వాత చతికల బడ్డాడు. దానికి తోడు గాయాలు కూడా అవుతుండటంతో ఇండియా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో మళ్ళీ ఢిల్లీ జట్టు తరపున ఆడి తన సత్తా ఏంటి అనేది నిరూపించుకున్నాడు.
అయితే ఐపీఎల్ తర్వాత కొన్ని మ్యాచ్ ల కోసం ఇండియా జట్టుకు ఆడిన మళ్ళీ చోటు కోల్పోయాడు. కానీ ఇలాంటి సమయంలో వన్డేలో హ్యాట్రిక్ అనేది తీసి చర్చలోకి వచ్చాడు. అయితే కుల్దీప్ యాదవ్.. ఆస్ట్రేలియా అలాగే వెస్టిండీస్ జట్ల పైన వన్డే ఫార్మాట్ లో హ్యాట్రిక్ అనేది తీసాడు. వన్డేలో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్.. రెండు హ్యాట్రిక్ లు తీసిన తొలి బౌలర్ గా యాదవ్ నిలిచాడు.
ఇప్పుడు కుల్దీప్ యాదవ్ మూడో హ్యాట్రిక్ అనేది కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఇది లిస్ట్ లోకి ఎక్కదు. ఎందుకంటే ఇది కుల్దీప్ యాదవ్ భారత ఏ జట్టు తరపున తీసాడు. అయితే సంజూ శాంసన్ కెప్టెన్సీలో భారత ఏ జట్టు ఇప్పుడు న్యూజిలాండ్ ఏ తో వన్డే సిరీస్ లో తలపడుతుంది. అందులో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్.. సోలియా, వాన్ బీక్, జో వాల్కర్, జాకబ్ డప్పీలను వరుసగా పెవిలియన్ పంపి ఈ ఘనత అందుకున్నాడు.

Advertisement

Visitors Are Also Reading