Telugu News » ప్ర‌భాస్ “ఆదిపురుష్” పై కేటీఆర్ కామెంట్ల వెన‌క అస‌లు కార‌ణం అదేనా..?

ప్ర‌భాస్ “ఆదిపురుష్” పై కేటీఆర్ కామెంట్ల వెన‌క అస‌లు కార‌ణం అదేనా..?

by AJAY MADDIBOINA

బాహుబలి సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ కోలివుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఆదిపురుష్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా కృతిస‌న‌న్ సీత పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Ads

ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లను విడుదల చేయగా ప్రభాస్ శ్రీరాముడి గెట‌ప్ లో దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని సినిమాలతో బిజెపి తమ ఐడియాలజీ ని ప్రమోట్ చేస్తుస్తుంద‌ని వ్యాఖ్యానించారు. దానికోసం ఫండింగ్ కూడా జరుగుతుందని కేటీఆర్ ఆరోపించారు. ఆ సినిమాల‌లో ఆది పురుష్ కూడా ఒకటి అని అన్నారు. ఇటీవల వచ్చిన కాశ్మీరీ ఫైల్స్, ఉరి సినిమాలు కూడా ఆ కోవకే చెందుతాయి అని చెప్పారు.

అదేవిధంగా ఆది పురుష్ సినిమా కూడా హిందుత్వ భావజాలాన్ని యువతలో పెంచడానికి చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇలా మొత్తం 15 సినిమాలను బిజెపి వాళ్లు తీస్తున్నారని చెప్పారు. ఎన్నికల నాటికి ఈ సినిమాలను విడుదల చేస్తారని కేటీఆర్ ఆరోపించారు. ప్ర‌స్తుతం కేటీఆర్ చేసిన కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. దాంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.

krishnam raju

krishnam raju

కేటీఆర్ ను కొంతమంది సపోర్ట్ చేస్తుండగా మరికొంతమంది కేటీఆర్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం వెన‌క ఓ కార‌ణం కూడా ఉంది. ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణం రాజు బీజేపీలో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా ప్ర‌భాస్ కూడా బీజేపీలో చేర‌తార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. పొటిక‌ల్ ఎంట్రీని ప్ర‌భాస్ ఖండించారు. కానీ బీజేపీతో సంబంధం వ‌ల్ల‌నే కేటీఆర్ ప్ర‌భాస్ సినిమాపై ఇలాంటి కామెంట్లు చేసి ఉంటార‌ని భావిస్తున్నారు.

ALSO READ :

అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ లీక్ చేసిన స్నేహా రెడ్డి…ఏంటంటే…?

పూర్తిగా మారిపోయిన నిహారిక‌…వైర‌ల్ అవుతున్న ఫోటో..!


You may also like