Home » పూర్తిగా మారిపోయిన నిహారిక‌…వైర‌ల్ అవుతున్న ఫోటో..!

పూర్తిగా మారిపోయిన నిహారిక‌…వైర‌ల్ అవుతున్న ఫోటో..!

by AJAY
Published: Last Updated on
Ad

మెగాడాట‌ర్ నిహారిక ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. నాగ‌బాబు న‌ట‌వార‌సురాలిగా నిహారిక ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొద‌ట‌గా నిహారిక యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు న‌టించ‌డం మ‌రియు నిర్మించ‌డంతో కెరీర్ ను ప్రారంభించింది.

Advertisement

ఆ త‌ర‌వాత ఢీ డ్యాన్స్ షోకు యాంకర్ గా చేస్తూ అభిమానుల‌ను సంపాదించుకుంది. మొద‌ట్లో యాంక‌ర్ గా నిహారిక సెట్ అవుతుందా లేదా అని ప్రేక్ష‌కులు అనుమానం వ్యక్తం చేశారు.

కానీ నిహారిక త‌న టాలెంట్ తో యాంక‌ర్ గా స‌క్సెస్ అయ్యారు. ఆ తర‌వాత త‌నకు న‌ట‌న‌పై ఉన్న ఆస‌క్తితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. కానీ హీరోయిన్ గా అనుకున్న మేర స‌క్సెస్ అవ్వలేక పోయారు. ఇక నిహారిక ఆ త‌ర‌వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పి చైత‌న్య‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ స‌భ్యులు బంధువుల మ‌ధ్య వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

Advertisement

పెళ్లి త‌ర‌వాత నిహారిక న‌ట‌న‌కు గుడ్ బై చెప్పేశారు. కానీ నిర్మాత‌గా మాత్రం కొన‌సాగుతాన‌ని తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవ‌ల ఉగాది పండుగ నాడు అర్థ‌రాత్రి దాటిన త‌ర‌వాత ప‌బ్ లో ఉండ‌టంతో నిహారికతో పాటూ ప‌లువురు సెల‌బ్రెటీల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే అదే ప‌బ్ లో డ్ర‌గ్స్ ఆన‌వాళ్లు క‌నిపించ‌డంతో ఈ వార్త సంచ‌ల‌నం గా మారింది. ఈ ఘ‌ట‌న త‌ర‌వాత నిహారిక మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో క‌నిపించ‌లేదు. మీడియా ముందుకు రాలేదు. కాగా తాజాగా నిహారిక జిమ్ లో ద‌ర్శ‌నం ఇచ్చారు. జిమ్ లో క‌నిపిస్తున్న నిహారిక స‌రికొత్త లుక్ లో షార్ట్ హెయిర్ తో క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ALSO READ :

కేజీఎఫ్- 2 న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్స్…అంద‌రికంటే ఎక్కువ పుచ్చుకుంది ఎవ‌రో తెలుసా..!

Visitors Are Also Reading