Telugu News » Blog » అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ లీక్ చేసిన స్నేహా రెడ్డి…ఏంటంటే…?

అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ లీక్ చేసిన స్నేహా రెడ్డి…ఏంటంటే…?

by AJAY
Ads

అల్లు అరవింద్ కుమారుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరో గా మారిపోయారు. వరుస సినిమాలు చేస్తూ అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఇటీవల పుష్ప సినిమా తో పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం పుష్ప సీక్వెల్ లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే…తన స్నేహితురాలు స్నేహ రెడ్డిని అల్లు అర్జున్ వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా స్నేహా రెడ్డి కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ పిల్లల తో చేసే సరదా వీడియోలు డ్యాన్స్ వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలను స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. దాంతో స్నేహ రెడ్డికి కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగానే అభిమానులు ఉన్నారు. ఇక తాజాగా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా అభిమానులు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. మీ ఫేవరెట్ కలర్ ఏంటి అని ఓ నెటిజన్ అడగ్గా రెడ్ అంటూ సమాధానం ఇచ్చారు. మరో నెటిజన్ అల్లు అర్జున్ ఫేవరెట్ గుడ్ ఏంటి అని ప్రశ్నించగా బిర్యానీ అని చెప్పేశారు. ఇక మరో నెటిజన్ మీ రీసెంట్ ఫ్యామిలీ ఫోటో చూపించండి అనగానే పోస్ట్ చేశారు. అంతే కాకుండా తనకు లండన్ ఫేవరెట్ హాలిడే స్పాట్ అని స్నేహ రెడ్డి తెలిపారు.

Also read :

పూర్తిగా మారిపోయిన నిహారిక‌…వైర‌ల్ అవుతున్న ఫోటో..!


You may also like