బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా నిర్మాణం ఎన్టీఆర్ గారు కన్న కల. విశ్వామిత్ర తనకు నచ్చిన పాత్ర అని, ఆయన ఆ కథతో సినిమా తీయాలని చెబుతుండేవారు. సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఎన్టీఆర్ ఆ కళను వదిలిపెట్టలేదు. విశ్వామిత్రుడు ప్రథమపుత్రుడు ఆంధ్రుడు కాబట్టి అప్పటికీ మన దేశానికి ఆంధ్రదేశమని పేరు వచ్చిందని ఆయన చెబుతుండేవాడు. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన కొంతకాలం తరువాత ఎన్టీఆర్ బ్రహ్మార్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సినిమాల్లో నటించడం ఏంటని విమర్శలు వినిపించినా ఆయన అవేమి పట్టించుకోకుండా చిత్ర ప్రారంభోత్సవం జరిగింది.
Advertisement
ఇక ఈ బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రారంభోత్సవానికి జాతీయ స్థాయి రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. మీనాక్షి శేషాద్రి మేనకగా ఎంపికయ్యారు. ఇందులో బాలకృష్ణ హరిశ్చంద్రుడిగా, దుశ్చంతుడిగా ఈ చిత్రంలో రెండు పాత్రలు పోషించాడు. తెలుగుతో పాటు హిందీలో కూడా చిత్ర నిర్మాణం ప్రారంభించారు ఎన్టీఆర్. ఇక్కడే ఒక ఆసక్తికరమైన పరిమాణం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ పాలనను ఆయన ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొన్ని చిత్రాలు నిర్మించారు. హీరో కృష్ణ నటించిన సినిమాలు అధిక శాతం విజయవంతం అయ్యాయి కూడా. ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రానికి పోటీగా 1989లో కృష్ణ హిందీలో ఒక చిత్రాన్ని తీయాలని కృష్ణ నిర్ణయించుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్, కృష్ణ మధ్య వార్ నడుస్తోంది.
Also Read : గరికపాటి, చిరు లాంటి సంఘటనే ఎన్టీఆర్, బాల మురళి కృష్ణ మధ్య జరిగిందని తెలుసా ?
Advertisement
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కృష్ణ జిల్లాకు కానీ, గుంటూరు జిల్లాకు, లేదా ఎన్టీఆర్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నుంచే పోటీ చేయడానికి రెడీ అని హీరో కృష్ణ ప్రకటించారు. హిందీ సినిమా కోసం అమితాబ్‌ని సంప్రదించారు కృష్ణ. అయితే అప్పటికే ఆయన చాలా సినిమాలు ఒప్పుకొని బిజీగా ఉన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించలేనని కృష్ణ గారికి చెప్పేశారు అమితాబ్. ఎన్టీఆర్‌కి పోటీగా వచ్చే చిత్రంలో అమితాబ్ హీరోగా నటిస్తేనే దీనికి ధీటుగా ఉంటుందని.. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అమితాబ్‌ని ఒప్పించాడు. ఇక ఆ సమయంలో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ నిర్మిస్తున్న బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వర్షన్‌ని దెబ్బతీయడానికి కృష్ణ తీసే ఈ సినిమాకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మద్దతు పలికింది. సాంఘిక కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని పద్మాలయ స్టూడియోలో తీయడానికి అన్నీ ఏర్పాట్లు చేశారు.
Also Read : మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై వేణుస్వామి ఏమన్నారో తెలుసా ?
బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాన్ని 1989 శాసనసభ ఎన్నికల నాటికి విడుదల చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ వేశారు. రాజకీయాలతో పాటు బిజీగా ఉండడం వల్ల ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. దీంతో బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం విడుదలను వాయిదా వేశారు. ఇక ఆ సినిమా ఇప్పట్లో విడుదల కాదని అందరూ అనుకున్నారు. హీరో కృష్ణ కూడా అలాగే అనుకొని తాను తీయాలనుకునే హిందీ చిత్రాన్ని డ్రాప్ చేసుకున్నారు. అందరి ఊహలకు, ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించడం ఎన్టీఆర్‌కి మొదటినుంచే అలవాటు. బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాన్ని 1991లో విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేశారు. ప్రారంభం నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలుండడంతో బయ్యర్లు సినిమా కొనడానికి పోటీ పడ్డారు. అంతకు ముందు ఏ సినిమా కొనని హయ్యస్ట్ రికార్డు ధరకు బ్రహ్మర్షి విశ్వమిత్రను కొన్నారు బయ్యర్లు. ఇక ఈ చిత్రానికి పోటీగా విడుదల చేయడానికి నిర్మాతలు కాస్త వెనుకంజ వేశారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరువాత నటించిన చిత్రం కావడంతో దీనికి అంత క్రేజ్ వచ్చింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.
Also Read : ‘ భైరవద్వీపం ‘ సినిమాకు ఎన్టీఆర్, రజనీకాంత్, చిరంజీవితో ఉన్న లింక్ ఏంటంటే ?