Home » గరికపాటి, చిరు లాంటి సంఘటనే ఎన్టీఆర్, బాల మురళి కృష్ణ మధ్య జరిగిందని తెలుసా ?

గరికపాటి, చిరు లాంటి సంఘటనే ఎన్టీఆర్, బాల మురళి కృష్ణ మధ్య జరిగిందని తెలుసా ?

by Anji
Ad

గ‌రిక‌పాటి వ‌ర్సెస్ చిరంజీవి ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో న‌డుస్తున్న చ‌ర్చ‌. మెగాస్టార్ చిరంజీవిని గరిక‌పాటి అవ‌మానించార‌ని గ‌రిక‌పాటిదే త‌ప్ప‌ని కొంద‌రు అంటుంటే.. కాదు చిరంజీవిదే త‌ప్పు అని మ‌రో వ‌ర్గం వారు అన‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఇటీవ‌ల‌ జ‌రిగిన‌ అల‌య్‌-బ‌లాయ్ కార్య‌క్ర‌మంలో గ‌రిక‌పాటి ప్ర‌సంగం జ‌రుగుతున్న స‌మ‌యంలో నిర్వాహ‌కులు చిరంజీవి ఫోటో షూట్ ఏర్పాటు చేశారు. దీంతో చిరంజీవితో ఫోటోలు దిగేందుకు అభిమానులు పెద్ద సంఖ్య‌లో ఎగ‌బ‌డ్డారు. కార్య‌క్ర‌మంలో ఉన్న ఆహుతుల దృష్టి అంతా చిరంజీవి ఫోటో షూట్ పైనే ఉంది. ఎవ్వ‌రూ కూడా గ‌రిక‌పాటి స్పీచ్ విన‌డం లేదు. దీంతో గ‌రిక‌పాటికి కోపం వ‌చ్చి న‌న్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతాను. చిరంజీవి గ‌రిక‌పాటి వ‌ద్ద‌కు వెళ్లి క్ష‌మించ‌మ‌ని కోరి.. వీలున్న‌ప్పుడు త‌మ ఇంటికి భోజ‌నానికి ర‌మ్మ‌ని బుజ్జ‌గించాడు.


ఇక ఇది అంత‌టితో ఆగ‌లేదు. అందుకు ప్ర‌ధాన కార‌ణం మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు. చిరంజీవికి మంచి చేయాల‌ని అభిమానులు ఆశ‌తో ఉన్నారు. కానీ నాగ‌బాబు అన‌వ‌స‌ర విష‌యాల‌ను గెలుక్కొని మ‌రీ పెంట చేసేశారు. ఏ పార్టీ వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ ప‌డ‌డం ప‌రిపాటే అని కామెంట్స్ చేశారు నాగ‌బాబు. దీంతో మెగా అభిమానులు సోష‌ల్ మీడియాలో గ‌రిక‌పాటిని టార్గెట్ చేసి కామెంట్స్ చేశారు. చిరంజీవిని అనేంత పెద్ద‌వారా..? నానా మాట‌ల‌తో పోస్ట్‌లు చేస్తున్నారు మెగా అభిమానులు. ఈ ఘ‌ట‌న గురించి చెప్పుకుంటుంటే 37 ఏళ్ల కింద‌ట సీనియ‌ర్ ఎన్టీఆర్‌, మంగ‌ళంప‌ల్లి బాల‌ముర‌ళికృష్ణ మ‌ధ్య‌ గుర్తుకొస్తుంది. అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Also Read :  ఇక నుంచి కృష్ణతో సినిమాలు తీయకూడద‌ని శోభన్ బాబు ఎందుకు నిర్ణయించుకున్నాడో తెలుసా ?

ఎన్టీఆర్ న‌టుడిగా ఉన్న‌ప్పుడు బాల‌ముర‌ళీకృష్ణ న‌ర్త‌న‌శాల‌, విరాట‌ప‌ర్వం వంటి సినిమాల్లో పాట‌లు పాడారు. ఇందులో విరాట‌ప‌ర్వం సినిమా ఫ్లాప్ అయింది. బాల‌ముర‌ళీ కృష్ణ అంటే ఎన్టీఆర్‌కి గౌర‌వం ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ అంటే కూడా బాల‌ముర‌ళీకృష్ణ‌కి విశేషమైన గౌర‌వం ఉంది. వీరిద్ధ‌రి మ‌ధ్య ఎన్టీఆర్ సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్పుడు రాలేదు. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక విభేదాలు వ‌చ్చాయి. 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపించి.. 1983లో మొద‌టిసారి ముఖ్య‌మంత్రి అయ్యారు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎన్టీఆర్ తీసుకున్న వివాద‌స్ప‌ద నిర్ణ‌యం వ‌ల్ల‌నే బాల‌ముర‌ళీకృష్ణ‌కి ఎన్టీఆర్‌కి విభేదాలు వ‌చ్చాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చిత్ర‌, శిల్ప క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం 1961లో రాష్ట్ర ల‌లితా క‌ళా అకాడ‌మిని స్థాపించారు. అయితే ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో 1985లో అకాడ‌మీల కార‌ణంగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని, అవినీతి, అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ అకాడ‌మీల‌న్నింటిని ర‌ద్దు చేశారు.

Advertisement

Tributes to Shri Balamuralikrishna, on this Vidwan's Birth anniversary Today
ఎన్టీఆర్ అప్పుడు అలా తీసుకున్న నిర్ణ‌య‌మే మంగ‌ళంప‌ల్లి బాల‌ముర‌ళీకృష్ణకి కోపం తెప్పించింద‌ట‌. ఆ స‌మ‌యంలో బాలముర‌ళీకృష్ణ సంగీత అకాడ‌మికీ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎన్టీఆర్ నాకు ఎప్ప‌టి నుంచో తెలుసు. బాల‌ముర‌ళీకృష్ణ‌కి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌కుండా ఎన్టీఆర్ ర‌ద్దు చేయ‌డంతో.. ఒక క‌ళాకారుడు క‌ళ‌ల‌కు పెద్ద పీట వేయాల్సిన వ్య‌క్తి క‌ళ‌ల‌కు సంబంధించిన అకాడ‌మీల‌ను ర‌ద్దు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఓ క‌ళాకారుడిగాన ఘోర అనుమానం జ‌రిగింద‌ని, ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్నంత కాలం క‌చేరీలు నిర్వ‌హించ‌ను అని బాల‌ముర‌ళీకృష్ణ ప్ర‌తిజ్ఞ చేశారు. బాల‌ముర‌ళీకృష్ణ‌తో పాటు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కూడా ఎన్టీఆర్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. అకాడ‌మీల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ఓ ప్ర‌క‌ట‌న చేశారు. అయిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ అప్పుడు త‌న వైఖ‌రిని మార్చుకోలేదు. మంగ‌ళంప‌ల్లి వారికి ఎన్ని ఆహ్వానాలు వ‌చ్చినా ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్నంత కాలం క‌చేరీలు చేయ‌ను అన్న‌ట్టుగానే 1985 నుంచి 1989 వ‌ర‌కు బాల‌ముర‌ళీకృష్ణ ఎక్క‌డా కూడా క‌చేరీల‌లో పాల్గొన‌క‌పోవ‌డం విశేషం.

Also Read :  నాగ‌బాబు క‌వ‌రింగ్ మామూలుగా లేదుగా….అన్నందంతా అనేసి ఇప్పుడేమో ఇలా..!


ఇక 1989లో ఎన్టీఆర్ ఓడిపోయారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. అప్ప‌టి ముఖ్య‌మంత్రి మ‌ర్రి చెన్నారెడ్డి కోరిక మేర‌కు బాల‌ముర‌ళీకృష్ణ ర‌వీంద్ర‌భార‌తీలో త‌న గ‌లాన్ని విప్పారు. చెన్నారెడ్డి మంగ‌ళంప‌ల్లిని ఘ‌నంగా సత్క‌రించారు. ఎన్టీఆర్ మ‌ళ్లీ 1994లో సీఎం అయ్యారు. బాల‌ముర‌ళీకృష్ణ మ‌ళ్లీ పంతానికి పోయారు. అదేమాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నానంటూ క‌చేరికి పుల్‌స్టాప్ పెట్టేశారు. ఎన్టీఆర్ ప్ర‌భుత్వంలో పెద్ద ప‌ద‌వీలో ఉన్న ఐఏఎస్ అధికారి కే.వీ.ర‌మ‌ణాచారి ఎన్టీఆర్‌కి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని, వారి మ‌ధ్య ఉన్న అపోహ‌ల‌ను తొల‌గించేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించారు. ఓ సంద‌ర్భంలో ఎన్టీఆర్‌, మంగ‌ళంప‌ల్లి ఫోన్‌లో మాట్లాడుకునే అవ‌కాశం క‌ల్పించారు. కొద్ది రోజుల త‌రువాత బాల‌ముర‌ళీకృష్ణ‌ను హైద‌రాబాద్‌లో ఉన్న‌టువంటి పొట్టి శ్రీ‌రాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం కో ఛాన్స్‌ల‌ర్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఎన్టీఆర్ నివాసంలోనే మంగ‌ళంప‌ల్లి ఆ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. ఇక ఎన్టీఆర్ అన్నింటిని కాకుండా కొన్ని అకాడ‌మీల‌ను పున‌రుద్ధ‌రించారు. అలా ఎన్టీఆర్‌కి, మంగ‌ళంప‌ల్లికి మ‌ధ్య విభేదాలు త‌లెత్తి మ‌ళ్లీ స‌మ‌స్య పరిష్కారం అయింది.

Also Read :  ‘ భైర‌వ‌ద్వీపం ‘ సినిమాకు ఎన్టీఆర్‌, ర‌జ‌నీకాంత్‌, చిరంజీవితో ఉన్న లింక్ ఏంటంటే ?

Visitors Are Also Reading