Home » మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీపై వేణుస్వామి ఏమ‌న్నారో తెలుసా ?

మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీపై వేణుస్వామి ఏమ‌న్నారో తెలుసా ?

by Anji
Ad

నంద‌మూరి బాల‌కృష్ణ కొడుకు మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి ప్ర‌తీ సంవత్స‌రం ఎన్నో వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌స్తునే ఉన్నాయి. వాటిలో కొన్ని వాస్త‌వం ఉంటే మ‌రికొన్ని రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. ఇక వ‌చ్చే ఏడాది మోక్ష‌జ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. మోక్ష‌జ్ఞ లుక్‌ని చూసిన అభిమానులు మాత్రం మోక్ష‌జ్ఞ ఇప్ప‌ట్లో సినిమాల‌లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌నే కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి తాజాగా మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీకి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. అవి ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Also Read :  విడాకుల‌తో కోట్ల‌కు ప‌డ‌గెత్తిన సెల‌బ్రెటీల భార్య‌లు..!

Advertisement

ముఖ్యంగా నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌తిరోజు రాహుకాలం చూసుకుంటారు అని, య‌మ‌గండ కాలాన్ని చూస్తార‌ని వేణుస్వామి చెప్పారు. బాల‌కృష్ణ నాకు ఫోన్ చేసినా చెప్పిన స‌మ‌యం మంచిదో కాదో చెక్ చేసుకుంటారు అని చెప్పుకొచ్చారు. బాల‌య్య‌కి మ‌నం చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదని.. ఆయ‌నే చెబుతారు అని వెల్ల‌డించారు వేణుస్వామి. బాల‌కృష్ణ దాదాపు అన్నింటినీ ఫాలో అవుతారని, మోక్ష‌జ్ఞ జాతకం కూడా చూశానని.. ఆయ‌న సినిమాల్లోకి రావ‌డానికి కొంచెం స‌మ‌యం ఉంద‌ని చెప్పుకొచ్చారు. మోక్షజ్ఞ సినీ కెరీర్ చాలా బాగుంటుందని వెల్ల‌డించారు.

Advertisement

కుటుంబ స‌భ్యులు మాత‌రం వీలైనంత ఆల‌స్యంగా మోక్ష‌జ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్నారని తెలిపారు వేణుస్వామి. ముఖ్యంగా మోక్ష‌జ్ఞ సినిమాల్లోకి రావాలంటే రెండు నుంచి మూడేళ్ల స‌మ‌యం ఉంటుంద‌ని వేణుస్వామి వెల్ల‌డించారు. నాకు తెలిసినంత వ‌ర‌కు మోక్ష‌జ్ఞ సినిమాల్లోనే కెరీర్ ని కొన‌సాగిస్తార‌ని వేణుస్వామి కామెంట్లు చేసారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఛాన్స్ అస్స‌లు లేద‌ని తెలిపారు. వేణుస్వామి వెల్ల‌డించిన ఈ విష‌యాలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీ పై వేణుస్వామి వెల్ల‌డించిన విష‌యాలు నిజ‌మ‌వుతాయో లేదో వేచి చూడాలి మ‌రి.

Also Read :  ఇక నుంచి కృష్ణతో సినిమాలు తీయకూడద‌ని శోభన్ బాబు ఎందుకు నిర్ణయించుకున్నాడో తెలుసా ?

 

Visitors Are Also Reading