Home » ‘ భైర‌వ‌ద్వీపం ‘ సినిమాకు ఎన్టీఆర్‌, ర‌జ‌నీకాంత్‌, చిరంజీవితో ఉన్న లింక్ ఏంటంటే ?

‘ భైర‌వ‌ద్వీపం ‘ సినిమాకు ఎన్టీఆర్‌, ర‌జ‌నీకాంత్‌, చిరంజీవితో ఉన్న లింక్ ఏంటంటే ?

by Anji
Published: Last Updated on
Ad

నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న ర‌క‌ర‌కాల పాత్ర‌ల‌తో ఎన్నో సినిమాల్లో న‌టించారు. చారిత్ర‌కం, పౌరాణికం, జాన‌ప‌దం, ఫ్యాక్ష‌న్‌, సాంఘిక, ల‌వ్ ఇలా ఏ పాత్ర‌లో ఇమిడిపోతాడు. త‌న తండ్రి ఎన్టీఆర్ త‌రువాత ఆ రేంజ్‌లో ఏ పాత్ర‌లో అయినా జీవించ‌డం బాల‌య్య‌కి మాత్ర‌మే సాధ్యం అవుతోంది. బాల‌కృష్ణ కెరీర్‌లో జాన‌ప‌ద భైర‌వ‌ద్వీపం ఆయ‌న కెరీర్‌లో వ‌చ్చిన సినిమాల్లో టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ చిత్రం తెర‌కెక్క‌డం వెనుక పెద్ద విచిత్ర‌మే చోటు చేసుకుంది.

Advertisement

 

అప్ప‌టికే సింగీతం శ్రీ‌నివాస‌రావు బృందావ‌నం సినిమా చేసి సూప‌ర్ హిట్ కొట్టారు. విజ‌య పిక్ష‌ర్స్ వారు తీయాల‌నుకున్న జాన‌ప‌ద సినిమాకు సింగీతం శ్రీ‌నివాస‌రావునే ద‌ర్శ‌కునిగా అనుకున్నారు. పాతాల‌భైర‌వి లాంటి జాన‌ప‌థ క‌థ‌తో ముందు సినిమా తీయాల‌నుకున్నారు. ర‌చ‌యిత రావి కొండ‌ల‌రావు మంచి మ‌లుపుల‌తో కూడిన జాన‌ప‌ద క‌థ‌ను అల్లుకున్నారు. ఈ క‌థ విన్న వెంట‌నే బాల‌య్య‌కి కొత్త‌గా అనిపించింది. తండ్రి న‌టించిన పాతాల‌భైర‌విలా ఉండ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశాడు. హీరోయిన్‌గా అప్ప‌ట్లో జోరు మీద ఉన్న రోజాను తీసుకున్నారు. బాల‌య్య‌కి త‌ల్లిగా కే.ఆర్ విజ‌య‌, తండ్రిగా విజ‌య్ కుమార్‌, ఇక పెంపుడు త‌ల్లిదండ్రులుగా రాధాకుమారి, భీమేశ్వ‌ర‌రావు తీసుకోగా గురువుగా మిక్కిలినేని, య‌క్షిణిగా రంభ‌, మిగిలిన పాత్ర‌ల‌కు బాబుమోహ‌న్‌, ప‌ద్మ‌నాభం, సుత్తివేలు ఎంపిక‌య్యారు. ఈ చిత్రంలో భేతాళ మాంత్రికుడి పాత్ర కోసం ఎస్‌.వీ. రంగారావు లాంటి వారు కావాల‌ని అనుకున్నారు.

Advertisement

ఈ త‌రుణంలో బాలీవుడ్ న‌టులు నానా ప‌టేక‌ర్‌, అమ్రిష్ పురి పేర్లు ప‌రిశీలించారు. చివ‌రికీ మ‌ల‌యాళ న‌టుడు రాజ్‌కుమార్ తీసుకున్నారు. విల‌న్ పాత్ర‌కు విజ‌య‌సంస్థ‌లోని విజ‌య‌, రంగారావు పేరులోని రంగాను తీసుకొని విజ‌య రంగ‌రాజా అని పేరు పెట్టారు. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.లాల్ కుమారుడు క‌బీర్ లాల్‌ని సినిమాటోగ్రాప‌ర్‌గా తీసుకున్నారు. క‌బీర్‌లాల్ అంత‌కుముందే సింగీతం ద‌ర్శ‌క‌త్వంలో ఆదిత్య 369 సినిమాకు ప‌ని చేసి ఉన్నాడు. 1993 జూన్ 5 న మ‌ద్రాస్ వాహినీ స్టూడియోలో వేసిన సెట్‌లో షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్స‌వంలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.

ముహూర్తం షాట్ రోజా-బాల‌కృష్ణ దంప‌తుల‌పై తీశారు. రజినీకాంత్ క్లాప్‌నివ్వ‌గా.. చిరంజీవి స్విచ్ ఆన్ చేశారు. ఎన్టీఆర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 1994లో ఏప్రిల్ 14న విడుద‌లైన బైర‌వ‌ద్వీపం సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. బాల‌య్య ధైర్యంగా ఈ త‌ర‌హా పాత్ర చేసి హిట్ సాధించాడు. ఈ చిత్రంలో పాట‌లు విశేష ప్రాచుర్యం పొందాయి. న‌రుడా ఓ న‌రుడా ఏమి కోరిక పాట‌కు ఎస్‌.జాన‌కి ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కురాలుగా అవార్డు అందుకున్నారు. ఉత్త‌మ సినిమాగా అవార్డ సొంతం చేసుకుంది. సింగీతం శ్రీ‌నివాస‌రావు ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా అవార్డు గెలుచుకున్నారు. అదేవిధంగా బాలసుబ్ర‌హ్మ‌ణ్యం ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడి అవార్డు గెలుచుకున్నాడు. బాల‌య్య‌కి 1994లో ఉత్త‌మ ఫిల్మ్‌ఫేర్ అవార్డు వ‌రించింది.

Also Read :  ఇక నుంచి కృష్ణతో సినిమాలు తీయకూడద‌ని శోభన్ బాబు ఎందుకు నిర్ణయించుకున్నాడో తెలుసా ?

Visitors Are Also Reading