Home » కోమ‌టిరెడ్డి దీక్ష వాయిదా..ఎందుకంటే..?

కోమ‌టిరెడ్డి దీక్ష వాయిదా..ఎందుకంటే..?

by Anji
Ad

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండ‌లంలో 23 గ్రామ‌పంచాయ‌తీలున్నాయి. ఇబ్రాహీంప‌ట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి బండ‌రావిర్యాల గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నాడు. ఇక ఆ గ్రామాన్ని ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతాన‌ని ఎన్నో క‌ల‌ర్ ఫుల్ హామీలు ఇచ్చాడు. దీంతో మా బ‌తుకుల్లో వెలుగులు నిండుతాయ‌ని, గ్రామ రూపురేఖ‌లు మారిపోతాయని ఆ గ్రామ‌స్తులు ఆశ‌ప‌డ్డారు. కానీ వారి ఆశ‌లు అడిఆశ‌లుగానే మారిపోతున్నాయ‌ని పేర్కొంటున్నారు. ఇటీవ‌ల భువ‌న ఎంపీ అక్క‌డికి వెళ్లి స‌మ‌స్య కోసం 72 గంట‌లు దీక్ష చేయాల‌నుకున్నారు. కానీ దీక్ష ద‌స‌రా త‌రువాత చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Advertisement

అబ్దుల్లాపూర్ మెట్ మండ‌లంలోని ఆయా గ్రామాల్లో దాదాపు 209కి పైగా భూనిర్వాసితులు ఉన్నారని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలిపారు. బండ‌రావిర్యాల‌, చిన్న రావిర్యాల భూ నిర్వాసితుల‌కు న్యాయం చేయాలంటూ త‌ల‌పెట్టిన 72 గంట‌ల దీక్ష‌ను వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. వారంద‌రూ 14 ఏళ్ల కింద‌ట ప్ర‌భుత్వానికి భూములు అప్ప‌గించార‌ని, 2015లో మంత్రి కేటీఆర్ అక్క‌డికి వ‌చ్చి మైనింగ్ జోన్ ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ట్టు గుర్తు చేశారు. భూ నిర్వాసితుల‌కు నెల రోజుల్లో ప‌రిహారం ఇప్పిస్తామ‌ని మంత్రి చెప్పార‌ని పేర్కొన్నారు.

Advertisement

Also Read :  అక్టోబ‌ర్ నెల‌లో ఈ వ్యాధులు వ్యాపించే ప్ర‌మాదం ఉంది జాగ్ర‌త్త‌..!


మంత్రి కేటీఆర్ అక్క‌డికి వ‌చ్చి ఏడేండ్లు అవుతోంద‌ని, కానీ ఎలాంటి ప‌రిహారం ఇప్పించ‌లేద‌న్నారు. వారిని న్యాయం చేయాల‌ని 72 గంట‌ల నిర‌హార దీక్ష చేప‌ట్టాల‌ని అనుకున్న‌ట్టు తెలిపారు. కానీ క‌లెక్ట‌ర్ తో మాట్లాడితే అక్క‌డ కేవ‌లం 50 మందికి మాత్ర‌మే ప‌ట్టాలున్నాయ‌ని చెప్పిన‌ట్టు వెల్ల‌డించారు. దీంతో మిగ‌తా వారికి త‌రువాత ప‌రిహారం విష‌యం త‌రువాత చూస్తామ‌ని పేర్కొన్న‌ట్టు వెంక‌ట్ రెడ్డి తెలిపారు. అలా కుదర‌దు అని తాను చెప్ప‌డంతో అందుకు కొంచెం స‌మ‌యం కావాల‌ని క‌లెక్ట‌ర్ కోరిన‌ట్టు గుర్తు చేశారు. దీంతో 72 గంట‌ల దీక్ష‌ను వాయిదా వేసుకున్న‌ట్టు వెంక‌ట్ రెడ్డి తెలిపారు. 209 మందికి ఇప్పుడు ఉన్న మార్కెట్ ధ‌ర ప్ర‌కార‌మే ప‌రిహారం చెల్లించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అదేవిధంగా ముచ్ఛ‌ర్ల ఫార్మాసిటీ నిర్వాసితుల‌కు కూడా ఇప్పుడు ఉన్న మార్కెట్ ధ‌ర ప్ర‌కార‌మే ప‌రిహారం ఇవ్వాల‌ని, ప్ర‌తీ కుటుంబానికి ప్లాట్‌, డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాల‌న్నారు. లేనియెడ‌ల ద‌స‌రా త‌రువాత దీక్ష చేప‌డుతామ‌ని చెప్పారు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.

 Also Read :  కొత్త ట్రాఫిక్ రూల్స్:అవి ఉల్లంఘిస్తే 40000వరకు చలానా కట్టాల్సిందేనా..?

Visitors Are Also Reading