Home » పశువులంటే మాకు ప్రాణం అనే డైలాగ్ జీవితాన్నే మార్చేసింది.. వైరల్ అవుతున్న కొమరం కామెంట్స్..!

పశువులంటే మాకు ప్రాణం అనే డైలాగ్ జీవితాన్నే మార్చేసింది.. వైరల్ అవుతున్న కొమరం కామెంట్స్..!

by Anji
Ad

జబర్దస్త్ షో ద్వారా చాలా పాపులారిటీసి సంపాదించుకున్నారు కొమరం. తాజాగా నాని హీరోగా నటించిన దసరా చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొమురం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తమ జీవితం చాలా బాగుందని, ఐదేళ్లలో జీవితమే మారిపోయిందని చెప్పుకొచ్చాడు. 

Also Read : Naresh – Pavitra : ఆ కోరిక తీరాలని..ఏపీలో పవిత్ర, నరేష్ ప్రత్యేక పూజలు..!

Advertisement

కష్టపడితే ఫలితం దక్కుతుందని భావించానని ఆ ఫలితం దక్కిందని కొమరం తెలిపారు. సిటీలో ఉండాలని అనిపిస్తుంది. ఎక్కువ రోజులు ఉండలేనని ఆయన పేర్కొన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నానని నాలుగు ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని కొమరం తెలిపారు. “ నా జీవితంలో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని కొమరం కామెంట్లు చేశారు. రెండో కారు కొన్న సమయంలో నేను చాలా సంతోషించానని.. అడగని జీవితాన్ని దేవుడు ఇచ్చాడని తెలిపారు.నేను చదివింది పదోతరగతి మాత్రమేనని చెప్పుకొచ్చారు.  

Advertisement

Also Read :  పెళ్లికి ముందే ప్రియుడుతో కలిసి తిరుమలలో దర్శనం ఇచ్చిన జాన్వి

Manam News

నేను మిమిక్రీ బాగా చేస్తానని.. హమాలీ పని కూడా చేసినట్టు తెలిపారు. అక్కడ కేవలం రూ.6వేలు వచ్చేదని ఆయన తెలిపారు. బిత్తిరి, సత్తి, కలిసి పని చేశామని కొమరం అన్నారు. ఆ తరువాత ఇతర ఛానెళ్లలో కూడా పని చేశానని ఆయన తెలిపారు. జబర్దస్త్ లో వెంకీ అన్న పిలిచి ఛాన్స్ ఇచ్చారని కొమరం అన్నారు. కిర్రాక్ ఆర్పీ పశువులు అంటే ప్రాణం స్కిట్ చేశానని ఆ స్కిట్ పాపులారిటీ తెచ్చిపెట్టిందని ఆయన కామెంట్స్ చేశారు. ఒక ప్రోగ్రామ్ కోసం నా పేరును కొమరక్కగా మార్చుకున్నానని కొమరం కామెంట్స్ చేశారు. నేను ముసలి దానిని అనే చాలా మంది అనుకుంటారని కొమరం పేర్కొన్నారు. కొమరం కన్నీటి కష్టాల గురించి తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారనే సంగతి తెలిసిందే. ఇక కొమరం మరింత సక్సెస్ కావాలని అభిమానులు భావిస్తున్నారు. 

Also Read :  Upasana : ఇంట్లో కాకుండా విదేశాల్లో ఉపాసన సీమంతం… కారణం అదేనా…?

Visitors Are Also Reading