Home » ఐపీఎల్ లో రికార్డు సృష్టించిన కోహ్లీ.. ఒకే ఒక్కడు..!

ఐపీఎల్ లో రికార్డు సృష్టించిన కోహ్లీ.. ఒకే ఒక్కడు..!

by Anji
Ad

విరాట్ కోహ్లీ మరోమారు తన సత్తా చాటాడు. చాలా కాలం తరువాత కెప్టెన్సీ పగ్గాలను చేపట్టాడు కోహ్లీ.. బ్యాటింగ్ లో దుమ్ము రేపాడు. ఈ సీజన్ లో నాలుగో హాఫ్ సెంచరీతో అదరగొట్టారు. మొహలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో స్టాండ్ ఇన్ కెప్టెన్ గా వ్యవహరించారు కోహ్లీ. బ్యాటింగ్ లో ఫాఫ్ డుప్లెసిస్ తో కలిసి ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కి 137 పరుగులు జోడించారు. 

Also Read :  నేచురల్ స్టార్ 30 మూవీ టైటిల్ ఇదేనా..?

Advertisement

కోహ్లీ 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 59 పరుగుుల చేసి రాణించాడు. ఈ నేపథ్యంలోనే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మరే క్రికెటర్ కి లేని రికార్డును కోహ్లీ నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో 100 సార్లు 30 ప్లస్ స్కోర్ చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఆర్సీబీకి ఆడుతున్న కోహ్లీ 5 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ-20 ఫార్మాట్ లో 30 ఫ్లస్ స్కోర్ కూడా మంచి స్కోర్ గానే పరిగణిస్తారు. 30 ప్లస్ స్కోర్లలో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 

Advertisement

Also Read :  చైతూను పెళ్లి చేసుకోవాలంటే శోభిత‌కు 2 కిండిష‌న్స్ పెట్టిన నాగార్జున‌..అవి ఏంటంటే..?

Manam News

అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ సెంచరీల సెంచరీ నమోదు చేసినట్టు ఐపీఎల్ లో కోహ్లీ 30 ప్లస్ ల సెంచరీ నమోదు చేశాడు. మొత్తం మీద ఐపీఎల్ లో కోహ్లీకి 6888 పరుగులున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ 74 సెంచరీలున్నాయి. పంజాబ్ తో మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేశారు. కోహ్లీ 59, డుప్లెసిస్ 84 రన్స్ తో అద్భుతంగా రాణించారు. వీరిద్దరూ ఔట్ అయిన తరువాత రన్‌రేట్‌ దారుణంగా పడిపోయింది. మ్యాక్స్‌వెల్‌ 0, దినేష్‌ కార్తీక్‌ 7 దారుణంగా నిరాశపరిచారు. చివరలో లామ్‌రోర్‌ 7, షాబాజ్‌ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక ఈ మ్యాచ్ లో 175 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి వచ్చిన పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు 150 పరుగుల వద్దనే కుప్పకూలారు. దీంతో పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Also Read :  చైతూను పెళ్లి చేసుకోవాలంటే శోభిత‌కు 2 కిండిష‌న్స్ పెట్టిన నాగార్జున‌..అవి ఏంటంటే..?

Visitors Are Also Reading