Home » నేచురల్ స్టార్ 30 మూవీ టైటిల్ ఇదేనా..?

నేచురల్ స్టార్ 30 మూవీ టైటిల్ ఇదేనా..?

by Anji
Ad

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన మూవీ దసరా. ఈ  సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు ఎన్నడూ కనిపించని ఊరమాస్ పాత్రలో నాని నటించి మెప్పించాడు. ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. నాని కెరీర్ లో 30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది. 

Also Read :  చైతూను పెళ్లి చేసుకోవాలంటే శోభిత‌కు 2 కిండిష‌న్స్ పెట్టిన నాగార్జున‌..అవి ఏంటంటే..?

Advertisement

Advertisement

 ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్  విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా సినిమా యొక్క థీమ్ ను వివరించారు. తండ్రి కూతురికి మధ్య జరిగే కథ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం టైటిల్ గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్ ఖరారు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కియారా ఖన్నా నాని కూతురుగా నటిస్తోంది.   

Also Read :  దర్శకుడు సుకుమార్ పై IT దాడులు.. ఆ MLAలు కారణమని మీకు తెలుసా..?

మజిల్, నిన్ను కోరి వంటి సినిమా  అవుతుందని పేర్కొంటున్నారు అభిమానులు. ఈ మూవీతో నాని మరో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి శౌర్యవ్ నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్టేట్ ని మేకర్స్ త్వరలోనే ఇవ్వనున్నారు. 

Also Read :  పెళ్లిళ్లు చేసుకోవడంలో తెలంగాణ యువతులే బేటరా..ఆ సర్వే ఏం చెబుతుందంటే..?

Visitors Are Also Reading