Home » ఆరోగ్యం కోసం అద్భుత వాస్తు చిట్కాలు.. ఇవి అస్సలు విస్మరించకూడదు..?

ఆరోగ్యం కోసం అద్భుత వాస్తు చిట్కాలు.. ఇవి అస్సలు విస్మరించకూడదు..?

by Anji
Ad

జీవితానికి సంబంధించిన ఏడు ఆనందాల‌లో మొద‌టిది ఆరోగ్యం. దాని గురించి ప్ర‌తి ఒక్క‌రూ ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, అందంగా ఉండాల‌ని కోరుకుంటారు. కానీ అన్ని ర‌కాల ఒత్తిళ్లు స‌వాళ్ల మ‌ధ్య చాలా త‌క్కువ మంది మాత్ర‌మే మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మీరు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకుంటే ఇంటికి సంబంధించిన ముఖ్య‌మైన వాస్తు నియ‌మాల‌ను మ‌ర‌చిపోకూడ‌దు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డానికి వాస్తు నియ‌మాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

  • వాస్తు ప్ర‌కారం మంచి ఆరోగ్యాన్ని పొంద‌డానికి తూర్పున ఇల్లు ఉత్త‌ర దిశ‌లో స‌రిహ‌ద్దు గోడ త‌క్కువ త్తులో ఉండాలి. త‌ద్వారా సూర్యుని కిర‌ణాలు చ‌క్క‌గా ప‌డ‌తాయి. ఆరోగ్య‌వ‌రం ల‌భిస్తుంది.

 

  • వాస్తు దోషం ఉన్న ఇంట్లో జ‌న్మించిన పిల్ల‌ల‌కు కొన్ని ఆరోగ్య సంబంధిత స‌మ‌స్య‌లు ఉంటాయి.

 

  • వాస్తు ప్ర‌కారం. ఇంట్లో దూలం కింద కూర్చోకూడ‌దు ప‌డుకోకూడ‌దు.

Advertisement

  • వాస్తు ప్ర‌కారం.. ఇంటిలోప‌ల విరిగిన కిటికీలు త‌లుపులు వీలైనంత త్వ‌ర‌గా రిపేర్ చేయించాలి. కిటికి త‌లుపుల‌పై ప‌గుళ్లు ఏర్ప‌డినా అద్దాలు ప‌గిలినా స్త్రీల‌కు ర‌క్త సంబంధిత వ్యాధులు ఉంటాయి.

 

  • వాస్తు ప్ర‌కారం ప‌డ‌క గ‌దిలో మొక్క‌ల‌ను ఎప్పుడూ ఉంచ‌కూడ‌దు. ఎందుకంటే మొక్క‌లు రాత్రిపూట కార్బ‌న్ డై ఆక్సైడ్ విడుద‌ల చేస్తాయి. ఇది ప‌డ‌క‌గ‌దిలో నిద్రిస్తున్న వ్య‌క్తి ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం చూపుతుంది.

 

  • వాస్తు ప్ర‌కారం మంచం ఎప్పుడు త‌లుపు ముందు ఉండ‌కూడ‌దు.

  • వాస్తు ప్ర‌కారం ప‌డ‌క గ‌దికి ఒక‌టి కంటే ఎక్కువ ప్ర‌వేశాలు ఉండ‌కూడ‌దు. కాంతి కోసం ఒక‌టి లేదా రెండు కిటికీలుండాలి. సూర్యుని కిర‌ణాలు స్వ‌చ్ఛ‌మైన గాలికోసం తూర్పు దిశ‌లో ఉన్న కిటికీని ప్ర‌తిరోజు తెర‌వాలి.

Also Read :  Lata Mangeshkar : లతా మంగేష్కర్ చివరి పాట ఏమిటంటే..?

Visitors Are Also Reading