స్వర కోకిల, గాన కోకిల ఇలా ఎన్ని పేర్లు పిలిచినా తక్కువే లతా మంగేశ్వర్‌ను ఇవాళ ఉదయం ఆమె ముంబైలోని ఆసుప్రతిలో కన్నుమూశారు. లతాజీ మృతితో యావత్ సంగీత ప్రపంచం దిగ్బ్రాంతికి లోనైంది. స్వరకోకికలగా పేరుగాంచిన భారతరత్న అవార్డు గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తన కెరీర్‌లో వేలాది పాటలకు గాత్రాన్ని అందించారు. లతా అనేక భారతీయ భాషల్లో పాటలు పాడారు. ఆమె పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే లత చివరి పాట ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
లతా మంగేష్కర్ చాలా హిందీ పాటలకు ఆమె మధురమైన గాత్రాన్ని అందించారు. లతా మంగేష్కర్ దాదాపు 36 భారతీయ భాషల్లో 5వేలకు పైగా పాటలకు తన గాత్రాన్ని అందించారు. చివరగా విడదల అయిన లతా మంగేష్కర్ పాట విషయానికి వస్తే.. అది మయూరేష్ పాయ్ స్వరపరిచిన సౌగంధ్ మఝే ఈజ్ మిట్టికి ఈ పాట 30 మార్చి 2019న విడుదల అయింది. ఈ పాట దేశాన్ని, భారత సైన్యాన్ని గౌరవించేవిధంగా లుకా చుప్పి పాట. ఈ పాటను ఏ.ఆర్.రెహ్మన్ స్వరపరిచారు. లత ముంగేష్కర్ చివరి హిందీ ఆల్బమ్ 2004లో విడుదల అయిన వీర్ జారా చిత్రం.
Also Read : Latha Mangeshkar : లతాజీ ఇంటి పేరు వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసా..?