Home » మెగాస్టార్ ఫ్యామిలీతో పెట్టుకుని ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోయిన నటులు ఎవరంటే…!

మెగాస్టార్ ఫ్యామిలీతో పెట్టుకుని ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోయిన నటులు ఎవరంటే…!

by Bunty
Ad

ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి తెలియనివారు ఉండరు. ఇండస్ట్రీలో వీరి కుటుంబానికి ఎంతో గౌరవం ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి…తన కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మంది పేదలకు సహాయం చేస్తున్నారు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబం అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చాలా గౌరవం, మర్యాద. తోటి నటీనటులు కూడా మెగా ఫ్యామిలీకి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. మెగాస్టార్ కుటుంబాన్ని ఇష్టపడేవారు కోట్లాదిమంది ఉన్నారు. అయితే మెగాస్టార్ కుటుంబం అంటే పడని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మెగా కుటుంబాన్ని తిట్టి గొడవ పెట్టుకుని సినిమాలకు దూరమైన నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

# ఉదయ్ కిరణ్

టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అతి కొద్ది రోజుల్లోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. ఇక ఉదయ్ కిరణ్ ను చిరంజీవి ఇష్టపడి తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నాడు. దీంతో తన పెద్ద కుమార్తె సుష్మితతో ఎంగేజ్మెంట్ ఘనంగా చేశారు. అయితే ఏమైందో తెలియదు ఆ తర్వాత ఉదయ్ కిరణ్ సుస్మిత వివాహం ఆగిపోయింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలను కోల్పోయారు.

# శ్రీ రెడ్డి

Advertisement

కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో జరిగే అవమానాలు, అన్యాయాల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది. దగ్గుబాటి అభిరామ్ ను ఎప్పుడు తిడుతూ ఉంటుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ను బండ బూతులు తిట్టి రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక సినిమాలలో అవకాశాలు కోల్పోయి ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్ చేస్తూ వార్తల్లో నిరుస్తూ ఉంటుంది.

# చిన్ని కృష్ణ

ఇండస్ట్రీలో మంచి రైటర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిన్ని కృష్ణ కూడా చిరంజీవి కుటుంబాన్ని బండ బూతులు తిట్టాడు. చిరంజీవి కుటుంబం ఎవరిని దగ్గరికి తీసుకోదు, సహాయం చేయదు అంటూ వారిపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన ఆరోపణలు అబద్ధం అని తెలుసుకున్న కొందరు వ్యక్తులు ఆయనకు ఆఫర్స్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను కోల్పోయారు.

# పోసాని కృష్ణ మురళి

ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి పోసాని కృష్ణ మురళి వరుస సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండేవారు. అయితే ఇతను కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై పదే పదే మాట్లాడి ఇండస్ట్రీలో అవకాశాలను తగ్గించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ వీళ్లేనా?

Ramcharan-Upasana: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది

రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏదో తెలుసా..?

Visitors Are Also Reading