Home » కేజీఎఫ్-2 ప్రముఖ నటుడు మృతి.. ఎలా అంటే..!!

కేజీఎఫ్-2 ప్రముఖ నటుడు మృతి.. ఎలా అంటే..!!

Ad

ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కే జి ఎఫ్ 2 ఈ మూవీ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించింది. దీంతో మూవీ యూనిట్ అంతా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో వారికి షాక్ తగిలింది. కే జి ఎఫ్ 2 మూవీ లో నటించినటువంటి ప్రముఖ నటుడు మృతి చెందాడు. ప్రముఖ కన్నడ ఇండస్ట్రీ నటుడు మోహన్ జూనేజ చనిపోయారు.

Advertisement

గత కొద్ది రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ఇవాళ వేకువజామున శ్వాస విడిచారు మోహన్. సీరియల్స్ నుంచి తన కెరీర్ ప్రారంభించిన ఆయన చాలా తక్కువ కాలంలోనే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి మంచి నటుడిగా పేరు పొందాడు.

Advertisement

ఇప్పటి వరకు ఆయన వందకు పైగా సినిమాలలో నటించారు. చివరి సినిమా పాన్ ఇండియా లెవల్లో కే జి ఎఫ్ చాప్టర్ టు లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. దీంతో ఆయన మరణం పట్ల కన్నడ సినీ పరిశ్రమ షాక్ కు గురయింది. దీంతో కే జి ఎఫ్ టీం మరియు కన్నడ ఇండస్ట్రీ మొత్తం ఆయనకు సంతాపం ప్రకటించారు.

ALSO READ;

ఆ హీరోయిన్ విష‌యంలో బాల‌కృష్ణ ర‌వితేజ‌ను కొట్టారా..? అస‌లేం జ‌రిగింది..!

May 7th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Visitors Are Also Reading