Home » 91 ఏళ్ల కీరవాణి తండ్రి యంగ్ గా కనిపించడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.!!

91 ఏళ్ల కీరవాణి తండ్రి యంగ్ గా కనిపించడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్లలో టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి. అలాంటి రాజమౌళి తీసిన సినిమాలు సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నాయి. తాజాగా ఆయన తీసి సక్సెస్ కొట్టిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి ఘనత సాధించిందో మనందరికీ తెలుసు. ఆస్కార్ నామినేషన్లలో ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు ఎంపికై అవార్డు సాధించడం దేశానికి గర్వకారణం. దీంతో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమూయిపోతోంది. అయితే ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాటకు మ్యూజిక్ అందించింది కీరవాణి, ఈ పాటను రాసింది చంద్రబోస్. అయితే ఈ పాట రిలీజ్ అయినప్పటి ఇప్పటివరకు ప్రతిరోజు మార్మోగిపోతూనే ఉంటుంది. ప్రేక్షకుల హృదయాలని ఎంతగానో గెలుచుకుందని చెప్పవచ్చు.

also read:చిరు ప్రాణంగా ప్రేమించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Advertisement

అలాంటి సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డుని గెలుచుకోవడం ఆర్ ఆర్ఆర్ మూవీ యూనిట్ ని ఎంతో పేరు తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఇంతటి ఘనత వెనుక RRR చిత్ర యూనిట్ తో పాటుగా, జక్కన్న కుటుంబం కూడా ఉందని చెప్పవచ్చు. అయితే రాజమౌళి ఏ సినిమా తీసిన వారి కుటుంబంలోని అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. ఇందులో కీరవాణి భార్యవల్లి ప్రొడక్షన్, ఇక రాజమౌళి భార్య రమా కాస్టూమ్స్, కీరవాణి కొడుకు కాలభైరవ పాటలు పాడుతూ ఉంటారు. ఈ విధంగా వారు కలిసికట్టుగా పనిచేసే సినిమాలు సక్సెస్ అందుకుంటున్నారు. అయితే ఇప్పటికీ రాజమౌళి కుటుంబం ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉంటారట. ఇందులో కీరవాణి తండ్రి శివశక్తి దత్త, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అన్నదమ్ములు.

Advertisement

also read:పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. అందరికీ చెబుతాడంట..!!

సినిమాల మీద ఉన్న కోరికతో శివశక్తి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పటికి 91ఏళ్ల వయసు కలిగిన ఆయన సినిమాలకు దర్శకుడిగా చేస్తున్నారు. ప్రస్తుతం తిరుమల నాయక అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాంటి శివశక్తి దత్త ఈ వయసులో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అలాంటి ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఆరోగ్యమనేది మనకు దేవుడిచ్చిన వరం. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఒక ఆర్టిస్ట్ కు ముందుగా కావలసింది ఆరోగ్యం, అందం ఆ తర్వాతే అలంకారం అన్నారు. ఆరోగ్యం బాగుంటేనే ఆర్టిస్టుగా రాణించగలమని , అలాంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా కాపాడుకోవాలని ఆయన తెలియజేశారు.

also read:

Visitors Are Also Reading