Home » పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. అందరికీ చెబుతాడంట..!!

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్.. అందరికీ చెబుతాడంట..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మూవీతో పాన్ ఇండియా లెవల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో. అంతేకాకుండా టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు. ఆయన పెళ్లి విషయాన్ని ఎప్పుడెప్పుడు విందామా అని ఫ్యాన్స్ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై ప్రభాస్ స్పందిస్తున్న కానీ వివాహం ఎప్పుడు చేసుకుంటారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

Advertisement

ఈ తరుణంలో మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కొరకు ఐదు సంవత్సరాలు కేటాయించిన ప్రభాస్. ఈ సినిమా అయిపోగానే పెళ్లి చేసుకుంటారు అని అందరూ అనుకున్నారు. అయితే బాహుబలితో తన పేరు ఇంకా పెరగడంతో ఆయన ఇంకా కష్టపడాల్సి వచ్చింది. దీంతో తన వివాహం కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్నటువంటి సినిమాలు చూస్తే మరొక రెండు సంవత్సరాల వరకు ఆయనకు పెళ్లి అయ్యేలా కనిపించడం లేదు. అంటే రెండేళ్ల వరకు పెళ్లి ప్రస్తావన లేదన్న మాట.

Advertisement

తాజాగా ప్రభాస్ తన పెళ్లిపై స్పందించాడు. వివాహం గురించి నా దగ్గర సమాధానం లేదని స్పష్టం చేశాడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు అందరికీ నేనే చెబుతాను అని అన్నాడు. అందరూ ఆయన వివాహం గురించి అడుగుతున్న నాకు ఎప్పుడూ కూడా చిరాకు అనిపించదు అని తెలియజేశాడు. తన గురించి ఎంత ఆలోచిస్తున్నారో అర్థం చేసుకుంటాను అని అన్నాడు. అలా మీరు అడగడం సాధారణ విషయమే. మీ స్థానంలో నేను ఉన్న అలాగే ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్.

ఇవి కూడా చదవండి:

నిరుద్యోగులకు శుభవార్త.. టిఎస్పిఎస్సి కీలక నిర్ణయం.. ఏంటంటే..!!

నందమూరి హీరోతో జోడిగా నటించిన ముద్దుగుమ్మ మాజీ సీఎం భార్య అన్న సంగతి తెలుసా…!

 

Visitors Are Also Reading