Home » ఆ స్టార్ హీరోకు క‌ళ్యాణ్‌రామ్ భార్య స్వాతి వీరాభిమాని అంట‌..ఇంతకు ఆ హీరో ఎవ‌రంటే..?

ఆ స్టార్ హీరోకు క‌ళ్యాణ్‌రామ్ భార్య స్వాతి వీరాభిమాని అంట‌..ఇంతకు ఆ హీరో ఎవ‌రంటే..?

by Anji
Ad

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ ది చాలా డిఫ‌రెంట్ స్టైల్‌. ఆయ‌న‌ ఎవ్వ‌రినీ నొప్పించ‌డు. ఇండ‌స్ట్రీలో ఎన్ని కుళ్లు రాజ‌కీయాలున్నా ఒక‌రి విష‌యంలో ఎప్పుడూ జోక్యం చేసుకోడు. త‌న ప‌నేదో తాను చేసుకుంటూ పోతుంటాడు. నిర్మాత‌గా త‌న సినిమాలు తాను చేసుకుంటుంటాడు. త‌న తాత ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పెట్టి ఆ బ్యాన‌ర్ మీద ప్ర‌తిష్టాత్మ‌కంగా సినిమాలు తీస్తూ తాత పేరు నిల‌బెట్టేందుకు అహర్నిశ‌లు శ్ర‌మిస్తుంటారు. త‌న సినిమాల ద్వారా న‌ష్టం వ‌చ్చిన డిస్ట్రిబ్యూట‌ర్లు, బ‌య్య‌ర్ల‌కు త‌మ అమౌంట్‌నే తిరిగి ఇచ్చేస్తాడంట‌. ముఖ్యంగా త‌న సినిమాల వ‌ల్ల ఎవ్వ‌రు కూడా న‌ష్ట‌పోకూడ‌దు అనే సిద్ధాంతంతో క‌ళ్యాణ్‌రామ్ ప‌ని చేస్తాడు. క‌ళ్యాణ్‌రామ్‌ న‌టిస్తున్న తాజా చిత్రం బింబిసార విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Advertisement

తాజాగా వ‌చ్చి ట్రైల‌ర్ ఈ సినిమాపై భారీ అంచ‌నాలనే పెంచేసింది.ఇక‌ ఆగ‌స్టు 05న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. తాజాగా క‌ళ్యాణ్‌రామ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమాపై ఎంతో ఆస‌క్తి రేపుతున్నాయి. ట్రైల‌ర్ కూడా భారీగానే ఉంద‌న్న చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. పుట్టిన రోజు సంద‌ర్భంగా క‌ళ్యాణ్‌రామ్ త‌న ఫ్యామిలీతో క‌లిసి దిగిన ఫోటో కూడా సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్ అవుతోంది. క‌ళ్యాణ్‌రామ్ భార్య‌తో పాటు కుమారుడు, కుమార్తె ఉన్న క‌ల‌ర్‌పుల్ ఫొటోను నంద‌మూరి అభిమానులు ట్రెండ్ చేశారు.

Advertisement

క‌ళ్యాణ్‌రామ్ ఫ్యామిలీ బ‌య‌టి ఫంక్ష‌న్ల‌లో ఎక్క‌డ కూడా అస‌లు క‌నిపించ‌దు. క‌ళ్యాణ్‌రామ్ భార్య స్వాతి నంద‌మూరి ఫ్యామిలీ సంప్ర‌దాయాల్లోనే ఉంటుంది. ఆమె స్వ‌త‌హాగా వైద్య వృత్తిని అభ్య‌సించారు. అయితే ఆమె ఎక్కువ‌గా కుటుంబంతోనే స‌మ‌యం గ‌డిపేస్తుంటుంది. భ‌ర్త‌, ఇద్ద‌రూ పిల్ల‌లే లోకంగా ఇంటికే అంకిత‌మైపోయారు. స్వాతికి సీనియ‌ర్ హీరో టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున అంటే చాలా ఇష్టమ‌ట‌. నాగ్ న‌టించిన మ‌న్మ‌థుడు సినిమా అంటేనే ఆమెకు పిచ్చ‌పిచ్చ‌గా ఇష్ట‌మ‌ట. నాగార్జున హీరోగా న‌టించిన మ‌న్మ‌థుడు సినిమాను ఆమె లెక్క‌లేన‌న్ని సార్లు చూసింద‌ట‌. ఇక ఆమె క‌ళాశాలలో చ‌దువుతున్న రోజుల్లో నాగార్జున‌ సినిమా విడుద‌ల అవుతుందంటే ఆరోజు కాలేజ్ డుమ్మా కొట్టి మ‌రీ సినిమా చూసేద‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా క‌ళ్యాణ్‌రామ్ వెల్ల‌డించారు.

Also Read : 

హీరో విక్రమ్ కి ఏమైంది.. హై ఫీవరా..? గుండె పోటా..?

ఎన్టీఆర్ చాలా ఇష్ట‌ప‌డే వెజ్ వంట‌కం ఇదే.. ఆ హీరోయిన్ల‌కు కూడా రుచి చూపించేవార‌ట‌..!

Visitors Are Also Reading