Telugu News » Blog » హీరో విక్రమ్ కి ఏమైంది.. హై ఫీవరా..? గుండె పోటా..?

హీరో విక్రమ్ కి ఏమైంది.. హై ఫీవరా..? గుండె పోటా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా తిరుగులేని స్టార్ గా ఎదిగిన హీరో విక్రమ్ తీవ్రమైన జ్వరంతో అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అందులోనే ఆయనకు గుండెపోటు కూడా వచ్చిందని తెలుస్తోంది. ఈరోజు డిశ్చార్జ్ అవుతారని ఆశిస్తున్న తరుణంలో ఇలా జరగడం చాలా దారుణం. ఆయన ఇవాళ సాయంత్రం జరిగే పొన్నియన్ సెల్వన్ అనే మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా ఇంతటి విషాదం జరిగింది.

Advertisement

Advertisement

 

మరి ఆయన ఎందుకు అలా అస్వస్థతకు గురయ్యారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. కొంతమందేమో ఆయన గుండెపోటు వచ్చి క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారని ప్రచారంచేస్తున్నారు. మరికొంతమంది ఆయన హై ఫీవర్ వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని ప్రచారం నడుస్తోంది. ఏది ఏమైనా ఆయన ఫ్యాన్స్,సెలబ్రిటీలు అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారని సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ తీవ్రంగా వైరల్ అవుతోంది.

ఈ తరుణంలో సోమవారం రోజున ఆయన మరో సినిమా కోబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుందని తెలుస్తోంది. మరి అప్పటి వరకు ఆయన కోలుకొని రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఆయన క్షేమంగా బయట పడాలని ఫ్యాన్స్ మరియు ప్రజలు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

also read:

వ‌ర్షాకాలంలో ఆ ర‌సం తాగితే ఎలాంటి రోగాలు ద‌రిచేర‌వు..!

Advertisement

ప్రేమ వివాహం చేసుకున్న వారే అధికంగా విడిపోవడానికి ప్రధాన కారణాలు అవేనా ?