Home » బుల్లితెర పై కళ్యాణ్ రామ్ రికార్డు.. మొదటి మూవీగా బింబిసార..!

బుల్లితెర పై కళ్యాణ్ రామ్ రికార్డు.. మొదటి మూవీగా బింబిసార..!

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇందుకు కారణం ఈ కుటుంబం నుంచి  పలువురు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడంతో పాటు వారిలో పలువురు స్టార్లుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. వీరి తరువాత మరో హీరో కళ్యాణ్ రామ్ కూడా పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచే వైవిద్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న కళ్యాణ్ రామ్. గత ఏడాది బింబిసార అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 

Advertisement

ముఖ్యంగా సోషియో ఫాంటసీ జోనర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం బింబిసార. టైమ్ ట్రావెల్ తో కాన్సెప్ట్ తో మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ సాధించింది. విడుదలకు ముందే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. విడుదలైన తరువాత ఏపీ, తెలంగాణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని ఏరియాలలో భారీ స్థాయిలోనే స్పందన లభించింది. దీని ఫలితంగా కలెక్షన్లు అధికంగానే వచ్చాయి. మొత్తానికి ఈ చిత్రం రూ.40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. రూ.22కోట్లకు పైగా లాభాలు సంపాదించింది. 

Advertisement

Manam News

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసిన బింబిసార మూవీ ఇటీవల జీ తెలుగు ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైంది. సినిమా హాళ్లు, ఓటీటీలో మాదిరిగానే బుల్లితెరపై కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీని ఫలితంగా ఈ చిత్రం అర్బన్ ఏరియాలో 11.46 రేటింగ్ సంపాదించుకుంది. అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాల్లో 9.45 టీఆర్ఫీ రేటింగ్ వచ్చింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్ రాబట్టిన చిత్రంగా బింబిసార రికార్డును క్రియేట్ చేసింది. ఈ మధ్యకాలంలో మంచి రేటింగ్ సాధించిన సినిమాగా  బింబిసార నిలిచింది. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ తదితర తారాగాణం కీలక పాత్రలు పోషించారు. 

Also Read :  వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్ గా నటించిన బాబీ సింహా గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading