Home » వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్ గా నటించిన బాబీ సింహా గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

వాల్తేరు వీరయ్య సినిమాలో విలన్ గా నటించిన బాబీ సింహా గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో గర్వించదగినటువంటి నటులలో బాబీ సింహా ఒకరు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయన పెద్దగా పరిచయం లేదు. తమిళ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్న పాత్రలను పోషించి తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో బాబీ సింహా. ఓవైపు హీరోగా.. మరోవైపు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రస్తుతం అతడు పుల్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న నటులలో బాబీ సింహా ఒకరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “వాల్తేరు వీరయ్య” చిత్రంలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బాబీ సింహా. 

Advertisement

తమిళంలో తెరకెక్కించిన జిగర్తాండ అనే సినిమాలో అద్భుత నటన కనబరిచినందుకు బాబీ సింహాకి ఉత్తమ సహాయ నటుడిగా నేషనల్ అవార్డుని అందుకున్నాడు. తెలుగులో ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ గా రీమేక్ చేశాడు. బాబీ సింహా పోషించిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేశాడు. టాలీవుడ్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. జాతీయ అవార్డును దక్కించుకున్న బాబీ సింహా గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. బాబీ సింహా గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Also Read :  IND VS NZ : అమ్మ చూస్తుండగా..ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన సిరాజ్..

Bobby Simha All Films Hit Flop Box Office Analysis - Bollywood Fever

Advertisement

బాబీ సింహా పేరుకే తమిళ నటుడు. కానీ ఇతడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకి సంబంధించిన వ్యక్తి అని.. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెబితే కానీ తెలియదు. నిజానికి ఇతను హైదరాబాద్ లోని మౌలాలి ప్రాంతంలో నవంబర్ 09, 1983లో జన్మించాడు. ఈయన సొంత ఊరు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి బందర్. తన విద్యాభ్యాసం నాలుగో తరగి వరకు మౌలాలిలో.. ఆ తరువాత కృష్ణ జిల్లా మోపిదేవిలో ప్రియదర్శిని విద్యాలయం పదోతరగతి వరకు చదివాడు. కోయంబత్తారు లో డిగ్రీ పూర్తి చేశాడు. 

Also Read :   Extra Jabardasth : రాఖేష్, సుజాత లవ్ స్టోరీ మామూలుగా లేదుగా..!

 

ఇక బాబీ సింహాకి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం. అందరి మాదిరిగానే సినిమాల్లో అవకాశం సంపాదించడం కోసం చాలా కష్టాలను అనుభవించాడు. అలా ఓ రోజు ఆడిషన్స్ లో ‘కదలిల్ సొదప్పువదు ఎప్పడి’ అనే సినిమాకి ఎంపికయ్యాడు. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ వెంటనే లవ్ ఫెయిల్యూర్, ఫిజ్జా వంటి సినిమాల్లో నటించే అవకాశం లభించింది. అలా ప్రారంభం అయినటువంటి బాబీ సింహా కెరీర్ 2014లో విడుదలైన ‘జిగర్తాండా’ అనే చిత్రంతో మలుపు తిరిగిందనే చెప్పాలి. జాతీయ స్థాయిలో మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత ఆయన తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక ఏడాదికి దాదాపు 10 సినిమాలకు పైగా చేస్తూ సౌత్ ఇండియాలో ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేనంత బిజీగా గడిపేస్తున్నాడు. 

Also Read :   ఏపీ పాలిటిక్స్ కి రిలేటెడ్ గా “వీరసింహారెడ్డి” బాలయ్య డైలాగ్స్ ! గోపీచంద్ మలినేని ఇచ్చిన రిప్లై అదుర్స్ !

Visitors Are Also Reading