Home » సమంతలాగే కాజల్ కు కూడా భర్త ఆంక్షలు..ఎడబాటు రానుందా..?

సమంతలాగే కాజల్ కు కూడా భర్త ఆంక్షలు..ఎడబాటు రానుందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొంతకాలం నుంచి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ పేరుపొందిన చాలామంది పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు అవుతున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన కాజల్ అగర్వాల్ బడా బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో కొన్ని కలతలు వచ్చినట్టు తెలుస్తోంది.. మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా చూద్దాం..టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది కాజల్. ఆ తర్వాత చందమామ,మగధీర, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్,ఆర్య 2 వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది..

 

అలాంటి ఈమె బిజినెస్ మాన్ కిచ్లు ని పెళ్లి చేసుకొని ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇక్కడే మొదలైంది అసలు బాధ.. కాజల్ పై తన భర్త కఠిన షరతులు పెడుతున్నట్టు ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నువ్వు సినిమాల్లో కొనసాగాలి, సినిమాలను వదిలి పెట్టకూడదు అని చెబుతూనే మరోపక్క షరతులు పెడుతున్నారట.. నువ్వు సినిమాలు చేస్తూ ఉన్న నేను మన అబ్బాయి నీల్ ను చూసుకుంటా.. షూటింగ్ షెడ్యూల్ అస్సలు మిస్ అవ్వద్దు.. యాక్టింగ్ కెరియర్ వదులుకోవద్దని కాజల్ కి సపోర్టుగా మాట్లాడుతూనే ఈ ఆంక్షలు తప్పనిసరి అంటున్నారట.. ఇంతకీ ఆ ఆంక్షలు ఏంటయ్యా అంటే.. లిప్ లాక్ సీన్స్.. రొమాం*క్ పాత్రలు, బెడ్ రూమ్ సీన్స్ , ఇతర అసభ్యకరమైన పాత్రల్లో చేయవద్దని ఆదేశాలు జారీ చేశారట.

Advertisement

Advertisement

also read:చిరు,బాలయ్య మధ్యలో ఉన్న ఈ పిల్లాడు ఎవరో చెప్పుకోండి..!!

ఓన్లీ లేడి ఓరియంటెడ్ సినిమాలు, కుటుంబ నేపథ్య కథలు ఉన్న సినిమాలకు మాత్రమే సైన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారట.. ప్రస్తుత కాలంలో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నదే ప్రశ్న.. ఇదే పరిస్థితి మొదట సమంత కూడా ఎదుర్కొందట.. చైతన్య ని పెళ్లి చేసుకున్న తర్వాత స్వేచ్ఛగా తను సినిమాలు చేయలేకపోతున్నానని బాగా డిసప్పాయింట్ అయినట్లు కూడా వార్తలు వినిపించాయి. చివరికి ఆమె విడాకులు కూడా తీసుకుంది.. దీంతో చాలామంది చైతు కుటుంబం ఆంక్షలు పెట్టడం వల్లే ఇలా జరిగింది అంటూ అంటున్నారు.. మరి ఈ విషయాల్లో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ వీటి గురించి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం కాజల్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది.. మరి ఈ ముద్దుగుమ్మ కూడా తన భర్త మాటను పాటించి ఉంటుందా లేదంటే సమంత లాగే విడాకుల బాట పడుతుందా అనే విషయం సోషల్ మీడియా వేదికగా చాలామంది చర్చించుకుంటున్నారు.

also read:

Visitors Are Also Reading