Home » సూపర్ స్టార్ కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి తృటిలో ప్రాణాపాయం తప్పిందని తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ గారికి, విజయ నిర్మల గారికి తృటిలో ప్రాణాపాయం తప్పిందని తెలుసా..?

by AJAY

సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతి చెందిన నాటి నుండి ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ హీరోయిన్ విజయనిర్మల రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే కృష్ణకు ఇందిరాదేవితో వివాహం జరగగా… తను ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ విజయనిర్మలతో ప్రేమలో పడ్డారు.

 

విజయనిర్మల కృష్ణలది హిట్ పెయిర్ అని అప్పట్లో చెప్పుకునేవారు. వీరిద్దరూ కలిసి నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ క్రమంలో ప్రేమలో పడిన వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మొదటిసారి అమ్మ కోసం అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి దగ్గరలోని పాపికొండల్లో జరిగింది.

కాగా కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న విజయనిర్మల కృష్ణ కోసం యూనిట్ సభ్యులు ప్రత్యేక బస ఏర్పాటు చేశారు. వారిద్దరికీ గోదావరిలో తెలియాడే విధంగా బోటును అమర్చి దానిని తాడుతో చెట్టుకు కట్టారు. అయితే ఆ బోటు లో విజయనిర్మల కృష్ణ బస చేస్తున్న సమయంలో రాత్రి భారీ తుఫాను వచ్చింది. ఆ తుఫాను దాటికి పడవలోకి భారీగా నీరు చేరింది. బోటు లో ఉన్న కృష్ణకు ఈత వచ్చు కానీ విజయనిర్మల గారికి ఇతరాదు.

దాంతో గట్టిగా కేకలు వేశారు. అలా ఇద్దరు కేకలు వేయడంతో యూనిట్ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కాగా స్టంట్ మాస్టర్ రాజు ఆ సమయంలో సాహసం చేసి బోటుకు గట్టిగా మరో రెండు మూడు తాడులను బిగించారు. వాటిని నాలుగు గుర్రాలకు కట్టి వాటి సహాయంతో విజయనిర్మల కృష్ణను ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ విషయాలను విజయనిర్మల ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Visitors Are Also Reading