Home » టాలీవుడ్ హీరోలపై సీరియస్ అయినా జస్టిస్ ఎన్వి రమణ.. తప్పేంటంటే..?

టాలీవుడ్ హీరోలపై సీరియస్ అయినా జస్టిస్ ఎన్వి రమణ.. తప్పేంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న సినిమాలు పేరుకే తెలుగు సినిమాలు కానీ అందులో తెలుగు భాష ఏమాత్రం కనబడడం లేదని, నటీనటులు కూడా తెలుగులో మాట్లాడడం లేదని జస్టిస్ ఎన్వి రమణ మండిపడ్డారు. వీరి భాషను చూసిన తెలుగు ప్రజలు కూడా భాషలను మర్చిపోతున్నారని, హీరో హీరోయిన్లు ఇతర నటీనటులు మాట్లాడే భాషను అనుకరిస్తున్నారని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తెలుగు భాష కనుమరుగైపోతుందని తెలియజేశారు. తెలుగు భాష కాపాడడం కోసం ఎంతోమంది తెలుగు పండితులు, మేధావులు తమదైన శైలిలో ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని,ఏదో కంటి తుడుపుగా మహాసభలు నిర్వహించి ఆ తర్వాత తెలుగు భాషాభివృద్ధికి ప్రయత్నాలు కూడా చేయడం లేదని అన్నారు.

Advertisement

also read:కృష్ణ మనసుపడ్డ ఆ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ముఖ్యంగా సినిమాలో నటించే హీరోలు వారి భాషను మార్చుకోవాలని సంచలన కామెంట్స్ చేశారు. ప్రముఖ గాయకుడు ఘంటసాల యొక్క శత జయంతి కార్యక్రమంలో సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ ముఖ్య అతిథిగా హాజరై ఈ సంచలన కామెంట్స్ చేశారు. సినిమాల్లో నటించే హీరోలను కోట్లాదిమంది అనుకరిస్తారని, మీరు ఈ విధంగా భాష మాట్లాడితే తెలుగు భాషలు పోయి, వారు మాట్లాడే భాష వస్తుందని భావించారు. కాబట్టి అచ్చ తెలుగు భాషల్లో మాట్లాడాలని, అంతేకాకుండా గాయకులు కూడా తెలుగులోనే పాటలు ఆడాలని అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తెలుగు రాకపోయినా సరే ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని మరీ తెలుగులోనే మాట్లాడే వారిని తెలియజేశారు.

Advertisement

ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు కూడా నేర్పాలని తెలియజేశారు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అసలు తెలుగు కనిపించడం లేదని,తెలుగు,హిందీ,ఇంగ్లీష్ మూడు భాషలను కలిపి మన అచ్చమైన తెలుగును పాడు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ప్రభుత్వాలు కూడా తెలుగు భాషను పక్కనపెట్టి పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాయని అన్నారు. ఈ మధ్యకాలంలోనే తమిళనాడు సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు తమిళ భాష పరీక్ష తప్పనిసరి అని ఒక రూల్ పెట్టింది. భాష పై అభిమానం ఎక్కువగా ఉన్న తమిళనాడు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు తప్పనిసరి చేసే విధంగా సర్కారు చర్యలు తీసుకోవాలని కోరారు.

also read:

Visitors Are Also Reading