Home » హీరో అవ్వాల్సిన ఆ వ్యక్తి మోహన్ బాబు వల్ల ట్రావెల్స్ ఓనరయ్యాడు.. ఎలా..?

హీరో అవ్వాల్సిన ఆ వ్యక్తి మోహన్ బాబు వల్ల ట్రావెల్స్ ఓనరయ్యాడు.. ఎలా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా పరిశ్రమలో కలెక్షన్ కింగ్ గా పేరుపొందిన మంచు మోహన్ బాబు సినిమా ఇండస్ట్రీకి చాలా విచిత్రంగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన తన నటన శైలితో కలెక్షన్ కింగ్ గా పేరు పొందారు. ఇండస్ట్రీ లోకి రావడానికి కొన్ని విచిత్రాలు జరిగాయని అంటుంటారు. మరి దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటో చూద్దాం.. మోహన్ బాబు ముందుగా దాసరి నారాయణరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. కానీ అనుకోకుండా సినిమా అవకాశం వచ్చింది.. దాసరి అప్పట్లో అంతా కొత్తవారితో సినిమా నిర్మించడానికి ప్లాన్ చేసుకున్నారు.

Advertisement

also read:మెగాస్టార్ చిరంజీవి పెళ్లి పత్రిక చూశారా.. అందులో ఆ ఒక్క పేరు చూస్తే..!!

1975 లో స్వర్గం నరకం సినిమా చేయాలనుకున్నారు. ఇందులో ఈశ్వర్ రావు, మోహన్ బాబు కథానాయకులుగా అనుకున్నాడు. కానీ అనుకోకుండా ఇందులో బోసు బాబు అనే కొత్త పాత్ర ప్రవేశమైంది. ప్రొడక్షన్ వారు బోసు బాబును హీరోగా చేయాలని రికమండేషన్ చేశారు. దీంతో దాసరి నారాయణ ఆలోచనలో పడ్డారు. ఈ సందర్భంలోనే ఏం చేయాలని ఆలోచిస్తుంటే. మోహన్ బాబుకు మరియు బోసు బాబుకు ఒక పరీక్ష పెట్టారు. ఎవరు బాగా నటిస్తే వారికి అవకాశం ఇస్తామని చెప్పడంతో మోహన్ బాబు తన నటనతో అందరిని మెస్మరైజ్ చేశారు. దీంతో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చాన్స్ మిస్ అయిన బోసు బాబు వ్యాపారవేత్తగా ఎదిగారు.

Advertisement

ఆ కాలంలోనే ఎస్విఆర్ బస్సు సర్వీస్ లు నడుపుతూ పెద్ద వ్యాపారవేత్తగా నిలదొక్కుకున్నారు. ఈ విధంగా మోహన్ బాబు వల్ల బోసు బాబు వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి కోట్లు సంపాదించారు.. దీన్ని బట్టి చూస్తే ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అది వస్తుంది అనేది నిజం. ఈ విధంగా బాగా సంపాదించిన బోసు బాబు తర్వాత కాలంలో నిర్మాతగా మారి అనేక చిత్రాలను నిర్మించారు. ఈ విధంగా మోహన్ బాబు కూడా కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగారు. అయితే మోహన్ బాబుకు ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. కోపం కూడా ఎక్కువే. క్రమశిక్షణకు మారుపేరు ఆయన అని చెప్పవచ్చు. ఆ తర్వాత మోహన్ బాబు సొంత నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ద్వారా చాలా చిత్రాలను నిర్మించి సక్సెస్ ను అందుకున్నారు.

also read:

Visitors Are Also Reading