Telugu News » కామెడీ స్కిట్ కాస్త సీరియస్ స్కిట్ అయిందిగా.. బుల్లెట్ భాస్కర్ కి గుండు గీయించిన జడ్జీలు..!

కామెడీ స్కిట్ కాస్త సీరియస్ స్కిట్ అయిందిగా.. బుల్లెట్ భాస్కర్ కి గుండు గీయించిన జడ్జీలు..!

by Anji
Ad

జబర్దస్త్ షో గురించి ఇప్పటికే ఎన్నో వివాదాలు బయటకు వచ్చాయి. స్కిట్ల పరంగా అందులో నటించే కమెడియన్లు తన్నులు కూడా తిన్నారు. తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్, ప్రస్తుతం జడ్జిగా వ్యవహరిస్తున్న అలనాటి తార ఖుష్బూ మధ్య తాజాగా జరిగిన వివాదం చర్చకు దారి తీసింది. జబర్దస్త్ షోలో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి లేదా ప్రజల అటెన్షన్ ను గ్రాబ్ చేయడానికి కమెడియన్లు ఎన్నో స్టంట్ లు వేస్తూ ఉంటారు. అందులో ఫేక్ ప్రేమ యవ్వారాలు, కమెడియన్ ఒకరినొకరు తిట్టుకోవడం, అరచుకోవడం వంటి విషయాలను హైలెట్ చేస్తూ మేకర్స్ ప్రోమో వదిలి, నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తూ ఉంటారు. అదే క్రమంలో తాజాగా షోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ గుండు గీయించుకోవడం బుల్లితెర ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది.


ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలో బుల్లెట్ భాస్కర్ తాజాగా తన టీమ్ తో కలిసి నిజం సినిమా స్పూఫ్ కి సంబంధించిన స్కిట్ ని ప్రదర్శించాడు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజం సినిమాలో గోపీచంద్ కు గుండు ఉంటుందని గుర్తు. అయితే గోపీచంద్ పాత్రలో ఉన్న బుల్లెట్ భాస్కర్ నిజం సినిమా పాపులర్ డైలాగ్ ఒకటి చెబుతూ ఉండగా.. మరో జడ్జిగా వ్యవహరిస్తున్న  టచ్ చేశారు. వెంటనే  భాస్కర్ రియాక్ట్ అవుతూ.. స్కిట్ ఫస్ట్ నుంచే పట్టుకోవాలి సార్. మధ్యలో పెట్టుకోవడం అంటే కష్టమవుతుంది అని చెప్పుకొచ్చాడు. ఆ వెంటనే కుష్బూ మాట్లాడుతూ.. స్పూఫ్ అనేది చేసినప్పుడు కరెక్ట్ గా ఉండాలి. అన్ని కరెక్ట్ గా ఉంటేనే బాగుంటుంది. మరి ఇక్కడ ఫీల్ అవ్వడానికి అంతగా ఏమీ లేదని కామెంట్ చేసింది. దీంతో వెంటనే భాస్కర్ తను స్కిట్ కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమంటూ జబర్దస్త్ వేదికపైనే గుండు గీయించుకుని అందరికీ షాక్ ఇచ్చాడు.

Advertisement

Advertisement

అంతేకాదు ఓకేనా సార్ అంటూ కృష్ణ భగవాన్ ను తిరిగి ప్రశ్నించాడు. దీంతో కృష్ణ భగవాన్ ఎఫెక్ట్ కావాలన్నా గానీ, నిజంగానే గుండు గీయించుకోమని చెప్పలేదు అని చెప్పగా, అంత అయిపోయాక పోయినా బొచ్చు వెనక్కి వస్తుందా? గుండెగించుకోవడానికి ముందే చెప్పాలి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. దీంతో వెంటనే ఖుష్బూ మాకు జడ్జిగా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఈ సీట్ మీద కూర్చున్నప్పుడు మాకు తప్పనిపించిన విషయాన్ని చెప్పే ఫ్రీడం కూడా లేకపోతే ఇంకెందుకు అని ఫైర్ అయింది. అంతలో బుల్లెట్ భాస్కర్ ఏదో చెప్పబోతే నేను నీతో మాట్లాడట్లేదు అంటూ ఖుష్బూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భాస్కర్ కూడా థాంక్యూ మేడం అంటూ స్టేజి దిగి వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ వీడియో చూసిన జనాలు పాపులారిటీ కోసమే జబర్దస్త్ మేకర్స్ ఇలాంటి వీడియోలు వదులుతూ ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading