Home » బాలకృష్ణని చూసి స్టేజి పైనే కన్నీరు పెట్టుకున్న jr.ఎన్టీఆర్.. కారణమేంటంటే..?

బాలకృష్ణని చూసి స్టేజి పైనే కన్నీరు పెట్టుకున్న jr.ఎన్టీఆర్.. కారణమేంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు నందమూరి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్.. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి బాలయ్య కు అప్పట్లో పెద్దగా మాటలు లేవు. ఎన్టీఆర్ మాత్రం బాబాయ్ తో ఎప్పుడు ఎప్పుడు కలుస్తామా అని ఎదురు చూసేవారట.. ఇక బాబాయ్ ని కలిసే రోజు రానే వచ్చింది. కలవడమే కాదు ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకునే భాగ్యం కలిగింది.. దీంతో స్టేజిపైనే ఎన్టీఆర్ కన్నీరు పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం.. అది 2001 సినీ గోయర్స్ అవార్డు ఫంక్షన్ లో నందమూరి అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని ఒక సంఘటన చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు అందించడానికి నందమూరి బాలకృష్ణ ను, ఎన్టీఆర్ ను కలిపి ఒకేసారి స్టేజి పైకి పిలిచారు.

Advertisement

ఈ తరుణంలోనే బాలకృష్ణ మాట్లాడుతూ పక్కనే ఉన్న ఎన్టీఆర్ భుజంపై చేయి వేశాడు. దీంతో ఆడిటోరియం అంతా నిశ్శబ్దంగా మారింది. వారిద్దరి కలయిక అభిమానులను ఎంతో ఆనందపరిచింది.. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ మాట్లాడతారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వెంటనే ఎన్టీఆర్ మైక్ పట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా మాట్లాడిన పెద్దలందరూ బాబాయి గొప్పతనాన్ని, ఎంతగానో చెప్పారు. కానీ వాటన్నింటినీ కలిపి ఒకే ఒక మాట చెప్తాను. బాబాయ్ నడిచే విజ్ఞాన గని, ఈ ఒక్క మాటే ఆయనకు సరిగ్గా సరిపోతుందని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు ఎన్టీఆర్.

Advertisement

also read:అనసూయ ఎవరి కూతురో తెలుసా? అసలు ఆమె తెలంగాణా, ఆంధ్రానా !

10 ఏళ్ల క్రితం రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా కోసం లైన్ లో నిలుచొని కాళ్లు తొక్కించుకుంటూ మరి సినిమా చూశానంటూ చెబు తుండగా కళ్ళలోంచి నీరు కారుతూనే ఉన్నాయి. ఆ తర్వాత సమరసింహారెడ్డి సినిమాకు వెళ్లి థియేటర్లో పది కుర్చీలు విరగ్గొట్టాను, 30 కేజీల పేపర్లు చల్లాను అయినా ఉద్వేగం ఆగలేదు అంటూ చెబుతూనే సారీ బాబాయ్ అంటూ కన్నీరు కార్చారు ఎన్టీఆర్. దీంతో బాలకృష్ణ దగ్గరకు తీసుకొని ఎన్టీఆర్ భుజంపై చేయి వేసి, బాలకృష్ణ కూడా కళ్ళల్లోకి నీరు తెచ్చుకున్నారు. ఈ అపురూప సంఘటన చూసి అక్కడున్న అభిమానులు కూడా కన్నీరు తెచ్చుకున్నారు.

also read:

Visitors Are Also Reading