Anchor Anasuya Father: గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ బుల్లితెరపై యాంకర్ గా మరింత పాపులారికి దక్కించుకుంది. సుమ తర్వాత అంతటి పాపులారిటీ దక్కించుకున్న యాంకర్ అనసూయ. తనదైన నటనతో, వాక్చాతుర్యంతో చలాకీగా కనిపిస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. ఇకపోతే అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై మంచి పొజిషన్ కి చేరుకున్న ఈమె ఫిలిం ఇండస్ట్రీలో ఎంత సంపాదించింది అనే వార్తలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి.
Advertisement
ఇది ఇలా ఉండగా, అనసూయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆమె స్వస్థలం నల్గొండ జిల్లా పోచంపల్లి. పక్క తెలంగాణ అమ్మాయి. తండ్రి సుదర్శన్ రావు ఓ వ్యాపారవేత్త. ఆయన తన కుమార్తెకు తన తల్లి అనసూయ పేరు పెట్టుకున్నారు. ఇంట్లో ఎప్పుడూ మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేసేవారు. అనసూయను కూడా ఆర్మీలోకి పంపించాలనుకున్నారట. అయితే బద్రుకా కాలేజ్ నుంచి 2008లో ఎంబీఏ పట్టా అందుకున్న తర్వాత ఐడిబిఐ బ్యాంకులో పనిచేసింది. అక్కడ కొన్నాళ్లపాటు విధులు నిర్వర్తించిన తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో చేరింది.
Advertisement
అక్కడ పని చేస్తున్నప్పుడే సాక్షి టీవీలో యాంకర్లు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది. అయినా మనకెందుకు వస్తుందిలే అనుకుంటున్న తరుణంలో ఆశ్చర్యకరంగా అనసూయని ఎంపిక చేశారు సాక్షి టీవీ మేనేజ్మెంట్ పెద్దలు. అయితే ఆమెకు న్యూస్ రీడర్ జాబ్ నచ్చకపోవడంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితమైంది. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో నాగా వంటి కొన్ని చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్టుగా దర్శనం ఇచ్చింది. కానీ మొదట్లో ఆమెను ఎవరు పట్టించుకోకపోవడంతో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకుంది. జబర్దస్త్ లో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక తాజాగా పుష్ప 2 లోను అదరగొట్టింది.
Advertisement
Read Also : మంత్రి రోజా తండ్రి బ్యాక్ గ్రౌండ్ తెలుసా…అందుకే రోజా ఎవరికి భయపడదు !