Telugu News » Blog » Jr NTR: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే వారి పని ఖతమే అంటున్న ప్రముఖ జ్యోతిష్కుడు..!!

Jr NTR: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే వారి పని ఖతమే అంటున్న ప్రముఖ జ్యోతిష్కుడు..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

రెండు తెలుగు రాష్ట్రాల్లో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానాలు ప్రజల్లో ఉంటాయి.. నందమూరి నటసార్వభౌమ తారక రామారావు వారసులుగా ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్ ఎంతో పేరు సంపాదించుకున్నారు. మిగతా వాళ్ళు ఉన్నా కానీ వీరిద్దరికి జనాల్లో ఉన్నంత క్రేజ్ వాళ్లకు లేదని చెప్పవచ్చు. ఇప్పటికే బాలకృష్ణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయి రాజకీయం చేయలేదు. హీరో గానే దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు.

Advertisement

అలాంటి ఎన్టీఆర్ రాజకీయం గురించి ప్రముఖ జ్యోతిష్యుడు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి నాయకుడు రాబోతున్నాడని, ఆ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని పార్టీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని కచ్చితంగా చెప్పగలను. కానీ ఇప్పుడు కాదు మరో మూడు సంవత్సరాలు పట్టవచ్చని అన్నారు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ టిడిపి పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని, ఇక చంద్రబాబు నాయుడు జాతకం ప్రకారం చూస్తే అధ్యక్షుడు రేసులో మరో నాయకుడు వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు.

Advertisement

also read:Sharukh Khan: 10 రూపాయలతో కెరీర్ మొదలుపెట్టిన షారుఖ్ ఆస్తుల విలువెంతో తెలుసా?

వీరబ్రహ్మేంద్రస్వామి సినిమాల్లో సక్సెస్ అయిన వాళ్ళు కచ్చితంగా రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతారని తెలిపారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని, చెప్పుకొచ్చారు. ఆ జ్యోతిష్కుడు అలా చెప్పినా కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

also read:

You may also like