Home » Sharukh Khan: 10 రూపాయలతో కెరీర్ మొదలుపెట్టిన షారుఖ్ ఆస్తుల విలువెంతో తెలుసా?

Sharukh Khan: 10 రూపాయలతో కెరీర్ మొదలుపెట్టిన షారుఖ్ ఆస్తుల విలువెంతో తెలుసా?

by AJAY
Ad

బాలీవుడ్ లోని స్టార్ హీరోల‌లో షారుక్ ఖాన్ ఒక‌రు. బాలీవుడ్ బాద్షాగా షారుక్ ను పిలుస్తుంటారు. ల‌క్ష‌ల్లో షారుక్ కు అభిమానులు ఉన్నారు. ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో న‌టించి షారుక్ ఖాన్ ఆ రేంజ్ లో అభిమానుల‌ను సంపాదించుకున్నారు. చిన్న‌య‌సులోనే సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో షారుక్ ఖాన్ ఇంటి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. సినిమా అవ‌కాశాల కోసం ఎంతోక‌ష్ట‌ప‌డ్డాడు. అంతే కాకుండా కెరీర్ ప్రారంభంలో చిన్నచిన్న పాత్ర‌ల‌లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.

Advertisement

మొద‌ట షారుక్ ఖాన్ టీవీ సీరియ‌ల్స్ లోనూ న‌టించాడు. అంతే కాకుండా మిడిల్ క్లాస్ నుండి వ‌చ్చిన షారుక్ కేవ‌లం ప‌ది రూపాయాల‌తో ముంబైలో అడుగుపెట్టాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అయితే ప్ర‌స్తుతం షారుక్ ఖాన్ ఆస్తుల చిట్టా చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. షారుక్ ఖాన్ కు దాదాపుగా ఇప్పుడు ప‌దివేల కోట్ల ఆస్తులు ఉన్నాయ‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement

షారుక్ ఖాన్ ముంబై లో ఖ‌రీదైన ఇంటిని క‌లిగి ఉన్న‌ట్టు తెల‌స్తోంది. అంతే కాకుండా లండ‌న్ లో షారుక్ ఖాన్ ఉండే ల‌గ్జరీ భ‌వ‌నం ఖ‌రీదు దాదాపుగా 20 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉంటుంద‌ట‌. అదేవిధంగా దుబాయ్ లోనూ షారుక్ కు ఆస్తులు ఉన్నాయ‌ని స‌మాచారం. అంతే కాకుండా బాలీవుడ్ లో అమితాబ్ సీనియ‌ర్ న‌టుడు అయిన‌ప్ప‌టికీ షారుక్ ఖాన్ కంటే త‌క్కువ ఆస్తుల‌ను క‌లిగి ఉన్నాడు.

ఇక షారుక్ ల‌గ్జ‌రీ ఇంటితో పాటూ ఖ‌రీదైన కార్ ల‌ను కూడా క‌లిగి ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా షారుక్ ఖాన్ న‌టించిన ప‌ఠాన్ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అంతే కాకుండా వ‌రుస ఫ్లాప్ ల‌తో డీలా ప‌డిపోయిన బాలీవుడ్ ను ఈ సినిమానే నిల‌బెడుతుందని బాలీవుడ్ ప్రేక్ష‌కులు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Visitors Are Also Reading