Home » బాలయ్య కూతురు పెళ్లిలో ఎన్టీఆర్ ను అంతలా అవమానించారా…? అసలేం జరిగిందంటే..!

బాలయ్య కూతురు పెళ్లిలో ఎన్టీఆర్ ను అంతలా అవమానించారా…? అసలేం జరిగిందంటే..!

by AJAY
Published: Last Updated on

ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న‌కు బాలీవుడ్ సైతం ఫిదా అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ లు ఎన్టీఆర్ తో సినిమాలు చేయాల‌ని చెబుతున్నారు. ముఖ్యంగా కొమురంభీముడో పాట ఎన్టీఆర్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక ఎన్టీఆర్ త‌న త‌ర‌వాత సినిమాను కొర‌టాల శివతో చేయ‌బోతున్నారు. ఈ సినిమా త‌ర‌వాత మ‌రో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేయ‌నున్నారు.

jr.ntr rare images

jr.ntr rare images

 

అలా వ‌రుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ త‌న జీవితంలో ఎన్నోస‌వాళ్ల‌ను ఎదురుకున్నార‌ట‌. కేవ‌లం సినిమాల్లోనే కాకుండా నిజ‌జీవితంలోనూ ఆయ‌న యుద్దం చేశార‌ట‌. ఓ స‌మ‌యంలో సొంత కుటుంబంలోనే అవ‌మానాలు కూడా ఎదురుకున్నార‌ట‌. ఈ విష‌యాల‌ను ప్ర‌ముఖ నిర్మాత త‌మ్మారెడ్డి భ‌రద్వాజ్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఎన్టీఆర్ బాల‌రామాయ‌ణం సినిమా త‌ర‌వాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..ఇండ‌స్ట్రీలో త‌న సినిమాలు ఫ్లాప్ అయినా కూడా లైట్ బాయ్ గా అయినా కొన‌సాగుతా అని చెప్పార‌ట‌.

jr.ntr rare images

jr.ntr rare images

ఎన్టీఆర్ మొద‌టిసారి ఎన్టీరామారావు ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన విశ్వామిత్ర సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. కానీ ఎన్టీరామారావు మ‌ర‌ణం త‌ర‌వాత ఎన్టీఆర్ నంద‌మూరి ఫ్యామిలీకి దూరం అవ్వాల్సి వ‌చ్చింద‌ట‌. అంతే కాకుండా బాల‌య్య కూతురి ఎంగేజ్మెంట్ లో జ‌రిగిన అవ‌మానంతో ఎన్టీఆర్ అక్క‌డ నుండి వెళ్లిపోయార‌ట‌.

ఎంగేజ్మెంట్ లో త‌న త‌ల్లికి త‌న‌కు ఎలాంటి మ‌ర్యాద‌లు జ‌ర‌గ‌పోగా ఎవ‌రూ క‌నీసం ప‌ట్టించుకోలేద‌ట‌. దాంతో అప్పుడే తాను ఎలా అయినా స‌క్సెస్ సాధించి త‌న‌కంటూ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. కుటుంబానికి ద‌గ్గ‌ర కావాల‌ని కూడా అనుకున్నారట‌. ఈ నేప‌థ్యంలోనే ఎన్నో క‌ష్టాల‌ను వ‌చ్చినా వాటిని దాటుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నార‌ట‌. ఒకానొక‌సంధ‌ర్బంలో బాల‌కృష్ణ ఎన్టీఆర్ కు నేనున్నాను అంటూ ముందుకు వ‌చ్చార‌ట‌. ఇక ఆ త‌ర‌వాత నుండి నంద‌మూరి ఫ్యామిలీతో ఎన్టీఆర్ కు అనుబంధం పెరిగింద‌ట‌.

Also read :

“ఎక్కడున్నా స్వర్గం వెతుక్కుంటా” అంటూ మెగాడాటర్ పోస్ట్… ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..!

మహేష్ బాబు అందం సీక్రెట్స్ “పాన్ బహార్ గుట్కా, రాయల్ స్టాగ్ విస్కీ” అంటూ నెట్టింట దారుణమైన ట్రోల్స్…!

Visitors Are Also Reading