Home » “ఎక్కడున్నా స్వర్గం వెతుక్కుంటా” అంటూ మెగాడాటర్ పోస్ట్… ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..!

“ఎక్కడున్నా స్వర్గం వెతుక్కుంటా” అంటూ మెగాడాటర్ పోస్ట్… ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు..!

by AJAY
Published: Last Updated on
Ad

మెగా డాటర్ నిహారిక పరిచయం అక్కర్లేని పేరు. ఢీ జూనియర్స్ డాన్స్ షో ద్వారా నీహారిక హోస్ట్ గా ప్రేక్షకులకు పరిచయమైంది. అంతేకాకుండా యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. నిహారిక యాంకర్ గా సెట్ అవుతుందా లేదా అని మొదట అనుకున్నారు. కానీ తన ఎనర్జీ తో తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా నటించింది కానీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించలేకపోయింది.

niharika konidela

niharika konidela

వరుస ఫ్లాపులు రావడంతో నిహారిక నటనకు దూరమైంది. ఇక లాక్ డౌన్ సమయంలో నిహారిక తాను ప్రేమించిన వ్యక్తి చైతన్య జాన్నగడ్డల ను వివాహం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇక వివాహం తర్వాత మాత్రం నిర్మాతగా మారింది. కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ అప్పుడప్పుడు టీవీ షోలలో, డిజిటల్ మీడియాలో కనిపిస్తోంది. అయితే పెళ్లి తర్వాత నిహారిక జీవితంలో కొన్ని చేదు అనుభవాలు చోటుచేసుకున్నాయి.

Advertisement

Advertisement

నిహారిక కొంతకాలం పాటు సోషల్ మీడియా కు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. కానీ దానికి కారణం ఏంటో తెలియలేదు. అంతేకాకుండా ఇటీవల ఉగాది నాడు రాత్రి 12 గంటల తర్వాత ఓ పబ్ లో పార్టీ నిర్వహించడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే ఆ దాడిలో పలువురు సెలబ్రిటీలతో పాటు నిహారిక కూడా ఉన్నారు. దాంతో పోలీసులు నిహారికను విచారణకు పిలిచారు. ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు పబ్ లో డ్ర* ఆనవాళ్లు కూడా ఉన్నాయని వార్తలు వినిపించాయి. దాంతో నిహారిక పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

అయితే నిహారిక ఇటీవల మళ్లీ సోషల్ మీడియా లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా తన తల్లితో కలిసి ఓ టివి ఇంటర్వ్యూలో కూడా పాల్గొంది. ఇక ప్రస్తుతం నిహారిక జోర్దాన్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ దిగిన ఓ ఫోటో షేర్ చేసిన నీహారిక “నేను ఎక్కడున్నా స్వర్గాన్ని వెతుక్కుంటాను” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటో కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. అర్ధరాత్రి గుడికి వెళ్ళట్లేదా…. ప్రసాదం తీసుకోవట్లేదు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా…. మరొకరు ఇంకోసారి దొరికితే స్వర్గం కనిపిస్తుంది లే అంటూ కామెంట్ చేశారు.

Also read :

గుర్తుపట్టనంతగా మారిపోయిన చందమామ హీరోయిన్….ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…!

“సర్కారువారిపాట” లో జనసేనను టార్గెట్ చేశారా….? గాజు గ్లాసు సీన్ పై పవన్ ఫ్యాన్స్ అనుమానాలు…!

Visitors Are Also Reading