Home » మహేష్ బాబు అందం సీక్రెట్స్ “పాన్ బహార్ గుట్కా, రాయల్ స్టాగ్ విస్కీ” అంటూ నెట్టింట దారుణమైన ట్రోల్స్…!

మహేష్ బాబు అందం సీక్రెట్స్ “పాన్ బహార్ గుట్కా, రాయల్ స్టాగ్ విస్కీ” అంటూ నెట్టింట దారుణమైన ట్రోల్స్…!

by AJAY
Ad

సినిమా తారలు కేవలం సినిమాల ద్వారానే కాకుండా యాడ్ ల ద్వారా కూడా సంపాదిస్తారు. సినిమా అయితే సంవత్సరాల తరబడి కష్టం ఉంటుంది. కానీ యాడ్ అయితే ఒక రోజులో షూటింగ్ పూర్తవుతుంది. అంతేకాకుండా సినిమాకు వచ్చే రెమ్యూనరేషన్ కంటే డబల్ అమౌంట్ వస్తుంది. మరోవైపు యాడ్ ని బట్టి కొన్ని సంస్థలు సేల్స్ పై పర్సంటేజ్ ను కూడా బ్రాండ్ అంబాసిడర్ లకు ఇస్తాయి.

Advertisement

దానికి కారణం సినిమా వాళ్ళు ప్రమోట్ చేస్తే ఆ బ్రాండ్ కు కచ్చితంగా గిరాకీ పెరుగుతుంది. దానికి కారణం తమకు ఇష్టమైన హీరో ఏది వాడితే అదే వాడాలని చాలా మంది అభిమానులు అనుకుంటారు. ఏం చెప్పినా గుడ్డిగా ఫాలో అవుతారు. అంతేకాకుండా మన హీరో చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ అయి ఉంటుందని భావిస్తారు. కొంతమంది హీరోలు మాత్రం యాడ్ లకు పూర్తిగా దూరంగా ఉంటారు.

mahesh babu mountain dwe

Advertisement

ఎన్ని డబ్బులు ఆఫర్ చేసినా యాడ్స్ లో నటించేందుకు ఇష్టపడరు. కానీ యడ్స్ కు ఒప్పుకునే వాళ్ళ వళ్ళే కొన్ని సమస్యలు ఉన్నాయ్. వాళ్ళు నిజంగా ఆ ప్రొడక్ట్స్ ను వాడుతారా అంటే అంతా సీన్ లేదు. కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పడి ఆ ప్రొడక్ట్ గురించి కనీస అవగాహన లేకుండా యాడ్ లలో నటిస్తారు. అయితే దేనికి పడితే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తే కొన్ని తలనొప్పులు తప్పవు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్, షారుక్ ఖాన్ లు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. గుట్కా బ్రాండ్ కు వీరిద్దరూ అంబాసిడర్ గా వ్యవహరించడం తో వీళ్ళను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు సైతం తాను చేసిన యాడ్స్ వాళ్ల ట్రోలర్స్ చేతికి చిక్కాడు. టాలీవుడ్ లోనే అత్యధిక యాడ్స్ చేసే హీరో మహేష్ బాబు. కూల్ డ్రింక్ నుండి…మత్తు డ్రింక్ ల వరకూ మహేష్ బాబు యాడ్స్ లో నటిస్తున్నారు.

అంతేకాకుండా పాన్ బహార్ అనే గుట్కా కి సైతం మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అదేవిధంగా మొన్నటివరకు తమ్స్ప్ కు ఆయనే అంబాసిడర్ గా ఉండేవారు. దాంతో మహేష్ బాబు అందానికి సీగ్రెట్స్ ఆయన వాడే ప్రొడక్ట్ లే అంటూ ట్రోల్ చేస్తున్నారు. గుట్కా తినడం…. అదేవిధంగా కార్బొనేటెడ్ డ్రింక్ తంసప్ తాగటం మరియు రాత్రులు రాయల్ స్టాగ్ మందు తాగడమే ఆయన అందానికి సీక్రెట్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్ లు వేస్తున్నారు. మరి దీనిపై మహేష్ ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Also read :

 

గుర్తుపట్టనంతగా మారిపోయిన చందమామ హీరోయిన్….ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…!

Visitors Are Also Reading