Home » Jasprit Bumrah: తండ్రైన బుమ్రా.. కుమారుడి పేరేంటో తెలుసా!

Jasprit Bumrah: తండ్రైన బుమ్రా.. కుమారుడి పేరేంటో తెలుసా!

by Bunty
Ad

టీమిండియా స్టార్ బౌలర్ జస్ట్ప్రీత్ బూమ్రా అదిరిపోయే శుభవార్త చెప్పారు. టీమిండియా స్టార్ పెసర్ జస్ట్ప్రీత్ బూమ్రా తండ్రి అయ్యాడు. బుమ్రా, సంజన గణేషన్ కు మగబిడ్డ జన్మించారు. ఈ విషయాన్ని స్వయంగా బుమ్రా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తన కుమారుడి పేరుని కూడా అనౌన్స్ చేశాడు. అంగద్ జస్ట్ప్రిత్ బుమ్రాను ఈ ప్రపంచంలోకి స్వాగతించామని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఒక ఫోటోని కూడా షేర్ చేసుకున్నాడు. చిన్న కుటుంబం పెద్దది అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పలువురు బుమ్రాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Jasprit Bumrah and his wife Sanjana Ganesan blessed with a baby boy

Jasprit Bumrah and his wife Sanjana Ganesan blessed with a baby boy

దినేష్ కార్తీక్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పలువురు అభిమానులు కూడా బుమ్రాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రసవ సమయంలో తన భార్య దగ్గరే ఉండాలని ఉద్దేశంతో శ్రీలంక నుండి స్వదేశానికి బుమ్రా వచ్చారు. పాకిస్తాన్ తో మ్యాచ్ తర్వాతే బుమ్రా ఇంటికి చేరుకున్నాడు. నేపాల్ తో మ్యాచ్ కు బుమ్రా దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు. గ్రూప్-4 దశ ప్రారంభానికి ముందే మళ్లీ ఆసియాకప్ కోసం శ్రీలంక చేరుకున్నాడు. బుమ్రా, సంజన గణేషన్ ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం.

Advertisement

Advertisement

మరోవైపు వన్డే ఫార్మాట్లో బుమ్రా బౌలింగ్ చేయక చాలా కాలం అవుతుంది. గాయపడిన స్టార్ బౌలర్ సర్జరీ పూర్తయిన తర్వాత పూర్తిగా కోలుకున్నాడు. ఇటీవల ఐర్లాండ్ టూర్ కి కూడా వెళ్లి వచ్చాడు. రెండు మ్యాచ్లో నూతన పర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి గ్యాప్ వచ్చినప్పటికీ బౌలింగ్ లో దూకుడు తగ్గలేదని నిరూపించుకున్నాడు. అయితే ఆసియా కప్ లో పాకిస్తాన్ పై బౌలింగ్ లో బుమ్రా బౌలింగ్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురుచూశారు. కానీ ఈ మ్యాచ్ పై వరుణుడి ప్రభావం పడింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిపోయింది. దీంతో బుమ్రా బౌలింగ్ చూసే అవకాశం అభిమానులకు రాలేదు.

ఇవి కూడా చదవండి

ఏం పీ***టారో పీక్కోండి.. పవన్ కల్యాణ్ పై హీరోయిన్ మాధవి సంచలన వ్యాఖ్యలు !

తన అసిస్టెంట్ పెళ్లికి రష్మిక ఆర్థిక సాయం… ఆశీర్వాదం ఇచ్చి మరి !

Srikanth : రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్..!

Visitors Are Also Reading