Telugu News » IPL 2022 : గ‌త ఏడాది వికెట్ తీస్తే రూ.1.66 కోట్లు.. ఈ ఏడాది ఆ బౌల‌ర్ ప‌రిస్థితి ఏమిటంటే..?

IPL 2022 : గ‌త ఏడాది వికెట్ తీస్తే రూ.1.66 కోట్లు.. ఈ ఏడాది ఆ బౌల‌ర్ ప‌రిస్థితి ఏమిటంటే..?

by Anji

క‌రోనా నేప‌థ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ కైల్ జేమీస‌న్ ఈ ఏడాది క్వారంటైన్ బ‌యోబ‌బుల్‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కేవ‌లం ఇంట్లో స‌మ‌యాన్ని గ‌డ‌ప‌డంతో పాటు త‌న ఆట‌ను మెరుగుప‌రుచుకోవ‌డానికి ఐపీఎల్ 2022తో పాటు న్యూజిలాండ్ దేశ‌వాళీ క్రికెట్ ఫ‌స్ట్ క్లాస్ టోర్న‌మెంట్ అయిన ప్లాంకెట్ షీల్డ్‌లో త‌న జ‌ట్టు ఆక్లాండ్‌కు దూరంగా ఉంటాను అని స‌మాచారం అందించాడు.

గ‌త ఏడాది ఐపీఎల్‌లో అత్యంత ఖ‌రీదు అయిన రెండ‌వ ఆట‌గాడిగా జేమీస‌న్ నిలిచాడు. అత‌న్నీ రెండ‌వ అత్యంత ఖ‌రీదు అయిన ఆట‌గాడిగా నిలిచాడు. అయితే ఈ సీజ‌న్ అత‌నికీ ప్ర‌త్యేకంగా ఏమి లేదు. ఆర్సీబీ త‌రుపున తొమ్మిది మ్యాచ్‌లు ఆడి తొమ్మిది వికెట్లు తీసాడు. అంటే ఆర్సీబీ త‌రుపున అత‌ను ఒక వికెట్‌ను ప‌డ‌గొట్టినందుకు రూ.1.66 కోట్లు అందుకున్నాడు.

జేమీస‌న్ మీడియాతో మాట్లాడారు. నేను చాలా కార‌ణాల వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్నాను. గ‌త 12 నెల‌లుగా బ‌యోబబుల్ క్వారంటైన్‌లో ఎక్కువ స‌మ‌యం గ‌డిపాను. రాబోయే 12 నెల‌ల షెడ్యూల్‌ను ప‌రిశీలిస్తే.. ఇప్పుడు నేను కుటుంబంతో గ‌డ‌పాల‌నుకుంటున్నాను. రెండోది, నేను అంత‌ర్జాతీయ క్రికెట్ కు చాలా కొత్త. రెండేండ్లు మాత్ర‌మే అయింది. కాబ‌ట్టి ఆట‌పై క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌నుకుంటున్నాను. నేను ఉండాల్సిన స్థాయికి చేరుకోలేక‌పోయాను. మూడు ఫార్మాట్ల‌లో ఆడాలంటే.. ఆట‌పై చాలా క‌ష్ట‌ప‌డాలి అని పేర్కొన్నారు.

ఫిబ్ర‌వ‌రి 2020లో భార‌త్‌పై అంత‌ర్జాతీయ ఆరంగేట్రం చేసిన జేమీస‌న్ 12 టెస్టులు, ఐదు వ‌న్డేలు, 8 టీ-20లు ఆడాడు. ఐపీఎల్ ఆడ‌కూడ‌దు అనే నిర్ణ‌యం చాలా క‌ష్ట‌మైన విష‌య‌మ‌ని, భ‌విష్య‌త్‌లో లీగ్‌లో తాను భాగ‌మ‌వుతామ‌ని ఆశిస్తున్న‌ట్టు తెలిపాడు. ప్రారంభంలో ఇది చాలా క‌ష్ట‌మైన నిర్ణ‌యం. నేను దీని గురించి చాలా ఆలోచించాను. కానీ నేను నా కెరీర్‌పై దృష్టిపెట్టాల‌ని, నా ఆటపై ప‌ని చేయాల‌నుకుంటున్నాను. కైల్ జేమీస‌న్ ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా వ‌ర్సెస్ న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఆడ‌నున్నాడు.

Also Read : ‘మహాన్’ జీవితంలో మలుపులు.. పవర్ ప్యాక్డ్ ట్రైలర్

You may also like