Home » ఫిబ్ర‌వ‌రి 25న అనుచరులతో జగ్గారెడ్డి సమావేశం

ఫిబ్ర‌వ‌రి 25న అనుచరులతో జగ్గారెడ్డి సమావేశం

by Anji
Ad

టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఫిబ్ర‌వ‌రి 25న అభిమానులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అనుచ‌రుల‌తో స‌మావేశం అవ్వ‌నున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, త‌దుప‌రి కార్య‌చ‌ర‌ణ‌పై చ‌ర్చించ‌నున్నారు. జ‌గ్గారెడ్డి సొంత పార్టీ పెడ‌తార‌న్న ప్రచారం జ‌రుగుతోంది. ఆయ‌న కూడా కాంగ్రెస్‌ను వీడాక తాను ఏ పార్టీలోను చేరేది లేద‌ని, స్వ‌తంత్ర‌గానే వ్య‌వ‌హ‌రిస్తాన‌ని స‌న్నిహితుల‌తో చెబుతున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి కాంగ్రెస్ అధిష్టానం, సోనియాగాంధీ కుటుంబంపైన మొద‌టి నుంచి త‌న విధేయ‌త‌ను ప్ర‌క‌టిస్తూ.. వ‌స్తున్న జ‌గ్గారెడ్డి టీపీసీసీ అధ్య‌క్షునిగా రేవంత్‌రెడ్డి నియామకం ప‌ట్ల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Advertisement

Advertisement

రేవంత్ పేరు ప‌రిశీలిస్తున్న‌ప్పుడే నియామ‌కం ప‌ట్ల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ ఆర్మీ పేరుతో సోష‌ల్ మీడియాలో త‌న‌పై దుష్ప్రాచారం చేస్తున్నారంటూ విమ‌ర్శ‌లు చేశారు. టీపీసీసీ అధ్య‌క్షునిగా రేవంత్ నియామ‌కం త‌రువాత కూడా ఆయ‌న వ్య‌వ‌హార శైలిని త‌ప్పుప‌డుతూ వ‌స్తూ ఉన్నారు. ఇమేజ్‌ను పెంచుకోవ‌డానికి రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని, త‌మ‌కు స‌మాచారం ఇవ్వ‌కుండ‌నే త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్య‌క్రమాలు ప్ర‌క‌టిస్తున్నార‌ని ఆక్షేపిస్తూ ఇటీవ‌ల అధిష్టానికి లేఖ రాసారు. పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డినైనా మార్చండి లేకుంటే ప‌ని తీరునైనా మార్చుకోవాల‌ని సూచించండ‌ని లేఖ‌లో కోరారు.

సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయ‌డం ద్వారా త‌న వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఉంటుంద‌నే కార‌ణంతోనే తాను కాంగ్రెస్‌ను ఇష్ట‌ప‌డ్డాన‌ని కానీ సొంత పార్టీ నేత‌లే త‌న‌పై సోష‌ల్ మీడియాలో బ‌య‌ట దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కోట్లు ఖ‌ర్చు గెలిచి ఇలా కోవ‌ర్టున‌న్న ముద్ర వేయించుకోవాల్సిన అవ‌స‌ర‌మేముంద‌ని, పార్టీకి రాజీనామా చేసి స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని వారికి చెప్పిన‌ట్టు స‌మాచారం.

Also Read :  భీమ్లానాయ‌క్‌కు ఏపీ ప్ర‌భుత్వం ఝ‌ల‌క్‌..!

Visitors Are Also Reading