Home » జగదేక వీరుడు అతిలోక సుందరి బడ్జెట్ రూ.8 కోట్లు.. వచ్చింది ఎంతో తెలుసా ?

జగదేక వీరుడు అతిలోక సుందరి బడ్జెట్ రూ.8 కోట్లు.. వచ్చింది ఎంతో తెలుసా ?

by Anji

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓల్డ్ హీరోయిన్స్ లలో చాలా మంది హీరోయిన్లు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ వారందరిలో శ్రీదేవి చాలా స్పెషల్. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, బాలీవుడ్ వంటి పలు ఇండస్ట్రీలలో ఆమె నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అలాంటి ఆమెకు తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఎక్కువ అవినాభావ సంబంధముంది. అలాగే కొద్ది సంవత్సరాలపాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ ఇతర ఇండస్ట్రీలో సినిమాలు చేసి అతిలోకసుందరిగా మారింది. అంతటి మహోన్నత హీరోయిన్ ప్రస్తుతం మన కళ్ల ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. అయితే ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు అత్యధిక పేరు తెచ్చినటువంటి మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆంజనేయస్వామి భక్తుడు రాజు ( చిరంజీవి) ఒక గైడ్. అనాథ పిల్లలను నలుగురిని తనతో పాటు పెంచుకుంటాడు. ఆ పిల్లలలో ఓ అమ్మాయికి ప్రమాదంలో కాలు విరిగిపోతుంది. హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే ఓ మూలికతో ఆ అమ్మాయిని నడిచేలా చేయవచ్చని ఓ స్వామి చెప్పడంతో రాజు హిమాలయాలకు బయలుదేరుతాడు. ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తుండగా.. దారి తప్పి మానససరోవరానికి వస్తాడు. స్వర్గలోకాన ఇంద్రుని కూతురు ఇంద్రజ ( శ్రీదేవి) భూలోకాన మానససరోవరం అందంగా ఉంటుందని తెలుసుకొని తండ్రి వద్ద అనుమతి తీసుకొని అక్కడికి వస్తుంది. తిరిగి వెళ్లే సమయంలో ఉంగరాన్ని జారవిడుచుకుంటుంది. రాజు వద్ద తన ఉంగరం ఉందని తెలుసుకున్న ఇంద్రజ పిల్లల ద్వారా అతనికి చేరువై ఆ ఉంగరాన్ని సంపాదించే ప్రయత్నంతో అతన్ని ప్రేమిస్తుంది. ఇదే సమయంలో మహాదృష్ట(అమ్రిష్ పురి) మాంత్రికుడు దేవకన్యను బలిస్తే తనకు మరిన్ని శక్తులు వస్తాయని ఇంద్రజని అపహరిస్తాడు. ఇంద్రజ అమాయకత్వానికి, స్వచ్ఛమైన ప్రేమకు ముగ్దుడైన రాజు మహాదృష్ట నుంచి ఆమెను రక్షించడంతో పాటు ఉంగరాన్ని, స్వర్గలోక ప్రవేశాన్ని త్యజించి మనిషిగా రాజుతోనే జీవించాలని నిర్ణయించుకోవడంతో చిత్రం సుఖాంతమవుతుంది. 

ఇక అప్పట్లో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండేది కాదు.. కానీ ఆ సమయంలో కెవలం కెమెరా ద్వారానే 70 శాతం గ్రాఫిక్స్ క్రియేట్ చేసి చాలా అద్భుతంగా తీశారు ఈ సినిమాని. కొంత వరకు గ్రీన్ మ్యూట్ వాడారట దర్శకుడు రాఘవేంద్ర రావు. అలా ఎంతో కష్టపడి తీసిన సినిమాకి అప్పట్లో ఎనిమిది కోట్ల బడ్జెట్ పెట్టారట. ఈ సినిమా అప్పట్లోనే రూ.8కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారట. అయితే ఈ సినిమా సూపర్ హిట్ సాధించి రూ.13కోట్లకు పైగానే వసూలు చేసిందని.. అప్పట్లో శ్రీదేవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ చిరంజీవి హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఓ అద్భుతమైన సినిమా అనే చెప్పవచ్చు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు

మెగా బ్రదర్స్ ని నిండా ముంచేసిన అజిత్..! ఇంతకీ ఏం జరిగిందంటే..?

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి జరగడం లేదా ?

ఈ ఫోటోలో అమాయకంగా పల్లెటూరి పిల్లలా కనిపించే అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

Visitors Are Also Reading