Home » ఈ ఫోటోలో అమాయకంగా పల్లెటూరి పిల్లలా కనిపించే అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో అమాయకంగా పల్లెటూరి పిల్లలా కనిపించే అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

by Mounika
Ad

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఎప్పటికప్పుడు వెండితెర తారల ఫోటోలు దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినీ ప్రేక్షకులు కూడా వారి అభిమాన తారల జీవిత విశేషాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.  ఈ తరుణంలో పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క తెలుగు సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా పాపులారిటీ సొంతం వేసుకున్న హీరోయిన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది.

Advertisement

ఇంతకీ ఈ ఫోటోలో ఉన్న ఆమె ఎవరో గుర్తుపట్టారా..? చూడ్డానికి పక్కింటమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ కూడా ఏలేస్తుంది. అయితే ఈ చిన్నది సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పలు హిందీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫొటోలో అమాయకంగా పల్లెటూరి అమ్మాయిల కనిపించే ఈమె ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా ఫేమస్‌ హీరోయిన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న భామ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌ హీరోయిన్‌ గా క్రేజ్‌ సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో కూడిన లేటెస్ట్ ఫోటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది. ఆమె ఎవరో కాదు.. సీతారామం చిత్రంతో ఒక్కరోజులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాగూర్.

Advertisement

మృణాళ్‌ కెరీర్‌ ఆరంభంలో ‘లవ్‌ సోనియా’ అనే హిందీ సినిమాలో నటించింది. వుమెన్‌ ట్రాఫికింగ్‌ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మృణాళ్‌ టైటిల్‌ రోల్‌ పోషించింది. ఈ చిత్రంలో అమాయక అమ్మాయి సోనియాగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఆ చిత్రంలోనిదే. 2018లో మృణాళ్‌ ఠాగూర్ నటించిన లవ్ సోనియా సినిమాలోకి సంబంధించిన పాత ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు  :

సూపర్ టైం టేబుల్ ని సెట్ చేసుకున్న ఆరేళ్ల చిన్నవాడు..? చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు.

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి జరగడం లేదా ?

 

Visitors Are Also Reading