Home » వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి జరగడం లేదా ?

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి జరగడం లేదా ?

by Anji

సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి ఏ వార్త వినిపించినా అభిమానులందరికీ సంతోషమే. అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, బ్యూటీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ 09, 2023న జరిగిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఆగస్టు 24వ తేదీన ఇటలీలో అతికొద్ది మంది సమక్షంలో జరుగుతుందని ఓ వార్త బయటికి వచ్చింది. వివాహం జరిగిన తరువాత హైదరాబాద్ లోనే గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్టు టాక్ వినిపించింది. 

కానీ ఈ వార్తలో వాస్తవం లేదని టాక్ వినిపిస్తుంది. ఇంకా వీరి పెళ్లి తేదీ ఫిక్స్ కాలేదని తాజా పరిస్థితులు చూస్తుంటే స్పష్టంగా అర్థం అవుతోంది. 24న పెళ్లి 25న వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున మూవీ విడుదలవుతుందని టాక్ వినిపించింది. కానీ గాండవధారి అర్జున సినిమా విడుదల అవుతున్నప్పటికీ..  పెళ్లి అదే సమయంలో కావడం లేదని.. అసలు పెళ్లికి ఇంకా డేట్ ఫిక్స్ కాలేదని మెగా వర్గాల నుంచి సమాచారం. ఒకవేళ  పెళ్లి డేట్ కనుక ఫిక్స్ అయి ఉంటే మాత్రం ఇప్పటికే పెళ్లి హడావి ప్రారంభమయ్యేది. 24 లేదా 25న పెళ్లి అయితే మాత్రం కేవలం పెళ్లికి 12 రోజులు మాత్రమే సమయముంది. 

దాదాపు 12 ముందే మెగా ఫ్యామిలీలో పెళ్లి హడావిడి ఉండేది. కానీ వారి ఫ్యామిలీలో పెళ్లికి సంబంధించిన హడావిడి మాత్రం ఏం కనిపించడం లేదు. దీనిని బట్టి చూస్తే మాత్రం మెగా ఫ్యామిలీలో ఆగస్టులో మాత్రం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగేవిధంగా కనిపించడం లేదు. పెళ్లి ఫిక్స్ చేయకపోవడానికి ప్రధాన కారణం నిహారిక విడాకులు అని కూడా తెలుస్తోంది. ఈ విడాకుల సమయంలోనే వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి చేస్తే ఫ్యామిలీలో అంతగా బాగుండదని.. అందుకే పెళ్లి గురించి ఇంకా డేట్ ఏం ఫిక్స్ కాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటిస్తే కానీ ఓ క్లారిటీ రాదు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చిరంజీవి కూతురు ఉదయ్ కిరణ్ గురించి అలా చెప్పిందా.. అందుకే వారి నిశ్చితార్థం ఆగిపోయిందా..?

చిరంజీవి సినీ కెరీర్ లో భారీ డిజాస్టర్ మూవీస్ ఇవే..!

Chiranjeevi: చైనాలో చిరంజీవి క్రేజ్ మాములుగా లేదుగా!.. మెగాస్టార్ పైనే ప్రెసెంటేషన్ ఇచ్చిన చిన్నారి.. అసలు స్టోరీ ఏంటంటే?

Visitors Are Also Reading