బుల్లితెరపై జబర్దస్త్ షోకు బాగా క్రేజ్ ఉంది. ఈ షో ద్వారా అనసూయ, రష్మీ చాలా పాపులర్ అయ్యారు. కేవలం యాంకర్స్‌కు మాత్రమే కాదు. ఈ షోలో చేసే ప్రతీ ఒక్కరికీ బయట నుంచి గుర్తింపు ఉన్నది. అయితే బజర్దస్త్ షో చూస్తున్నప్పుడు సాధారణంగా చాలా మందికి ఒక అనుమానం వస్తుంటుంది. అదేమిటంటే..? స్కిట్స్ చేస్తున్న నరేష్ వయస్సు ఎంత అని..? ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో ఉన్న నరేష్ ప్రస్తుతం టీమ్ లీడర్‌గా ఎదిగాడు.
Also Read : 10th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!
అతి తక్కువ సమయంలోనే జబర్దస్త్ షో ద్వారా తక్కువ సమయంలోనే నరేష్ కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నారు.అతని కామెడిని ఇష్టపడే ప్రేక్షకులు లక్షల సంఖ్యలో ఉన్నారు. చూడడానికి చిన్న పిల్లాడిలా కనిపించే నరేష్ తనదైన శైలిలో వేసే పంచ్ లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పొట్ట చుక్కలయ్యేలా పంచ్‌లతో నవ్వించే జబర్దస్ నరేష్ జబర్దస్త్ షోలో కమెడియన్ గా దూసుకెళుతూ ఉండటం గమనార్హం.
జబర్దస్త్ నరేష్ వయస్సు గురించి నెటిజన్లలో సందేహాలున్నాయి. ఓటు హక్కును కూడా కలిగి ఉన్న నరేష్ తాజాగా ఒక స్కిట్‌లో భాగంగా 22 సంవత్సరాలుగా తాను జిమ్ చేస్తున్నానంటూ తన వయస్సును చెప్పకనే చెప్పేశారు. జబర్దస్త్ నరేష్ వయస్సు నమ్మడానికి కష్టమైనా అతని అసలు వయస్సు మాత్రం ఇదే కావడం విశేషం. వేర్వేరు టీమ్‌లలో చేస్తూ.. టీమ్ లీడర్లకు సైతం గట్టీ పోటీ ఇస్తున్నారు. ప్రాక్టీస్ చేయకుండానే స్కిట్స్ చేయండ నరేష్ ప్రత్యేకత అనే చెప్పవచ్చు. బుల్లెట్ భాస్కర్ తన టీమ్ మంచి పేరు రావడానికి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. జబర్దస్త్ షో ద్వారా నరేష్ ఆర్థకంగా స్థిరపడ్డారని సమాచారం. ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో కూడా నరేస్‌కు సినిమా ఆఫర్లు వస్తున్నాయట.
కేవలం 22 ఏళ్ల వయస్సులోనే నరేష్ సెలబ్రిటీ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. నరేష్ తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఈవెంట్లలో కూడా నరేష్ సందడి చూస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటుండటం గమనార్హం. రియాలిటీ సోలలో కూడా పాల్గొంటున్న నరేష్ యాంకర్ ఉదయభానుతో కలిసి గ్యాంగ్ లీడర్ షో కూడా చేశారు.
Also Read : Jabardasth Varsha’జబర్దస్త్’ లోకి అడుగుపెట్టకముందు వర్ష ఆ జాబ్ చేసేదట !