Home » Jabardasth Varsha: ‘జబర్దస్త్’ లోకి అడుగుపెట్టకముందు వర్ష ఆ జాబ్ చేసేదట !

Jabardasth Varsha: ‘జబర్దస్త్’ లోకి అడుగుపెట్టకముందు వర్ష ఆ జాబ్ చేసేదట !

by AJAY
Ad

Jabardasth Varsha : జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది క‌మెడియ‌న్ ల‌కు లైఫ్ వ‌చ్చింది. వారిలో వేణు, ధ‌న్ రాజ్, చ‌మ్మక్ చంద్ర‌, రాకెట్ రాఘ‌వ, హైప‌ర్ ఆది, స‌ద్దామ్, సుధీర్ తో పాటూ ఎంతో మంది ఉన్నారు. కేవ‌లం క‌మెడియ‌న్లు మాత్ర‌మే కాకుండా ఈ షోకు యాంకర్లుగా వ్య‌వ‌హ‌రించిన అన‌సూయ మరియు ర‌ష్మిలు కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్ప‌డు ఇద్ద‌రూ సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు.

Jabardasth Varsha

Jabardasth Varsha

ALSO READ : RRR ప్రొమోషనల్ సాంగ్ ‘ఎత్తర జెండా’ సాంగ్ లో చేసిన తప్పుని గమనించారా ?

Advertisement

 

అన‌సూయ సినిమాల్లో కీ రోల్స్ చేస్తుండ‌గా ర‌ష్మి ఏకండా హీరోయిన్ గా కూడా న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. మ‌రోవైపు సుధీర్ కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ లో లైఫ్ వ‌చ్చిన కొంత‌మంది ఆ త‌ర‌వాత బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఈ షోను వ‌దిలి వెళితే మ‌రికొంద‌రు ఇత‌ర ఛానల్స్ బ‌డా ఆఫ‌ర్లు ఇవ్వ‌డంతో వెళుతుంటారు. అదే విధంగా కొత్త‌వాళ్లు కూడా చాలా మంది జ‌బ‌ర్ద‌స్త్ లోకి వ‌స్తూనే ఉంటారు. అలా వ‌చ్చిన వాళ్లు కూడా ఎంతో మంది స‌క్సెస్ అవుతున్నారు. అయితే ఒక‌ప్పుడు జ‌బర్ద‌స్త్ లో కేవ‌లం మ‌గ‌వాళ్లు మాత్రమే స్క్రిట్ లు వేసేవారు.

Advertisement

varsha emmanuel

varsha emmanuel

ఒక‌వేళ భార్య పాత్ర చేయాల్సి వ‌చ్చినా ఆ పాత్ర‌కు పురుషులే లేడీ గెట‌ప్ లు వేసి చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది జ‌బ‌ర్ద‌స్త్ లోకి అమ్మాయిలు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అలా జ‌బ‌ర‌స్త్ లోకి ఎంట్రీ ఇచ్చి అతిత‌క్కువ కాలంలో స‌క్సెస్ అయిన వారిలో వ‌ర్ష ముందువ‌రుస‌లో ఉంటుంది. హైప‌ర్ ఆది టీం ద్వారా వ‌ర్ష ప‌రిచ‌యం అయ్యింది.

Anchor varshini

Anchor varshini

వ‌ర్ష ఇమాన్యుయేల్ మ‌ధ్య లవ్ ట్రాక్ అంటూ ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు సీరియ‌ల్స్ లో కూడా వ‌ర్ష న‌టించింది. అభిషేకం, తూర్పు ప‌డ‌మ‌ర‌, ప్రేమఎంత మ‌దురం సీరియ‌ల్స్ లో న‌టించింది. మాస్ భాష‌లో మాట్లాడుతూ ప్ర‌స్తుతం కుర్రాళ్ల మ‌న‌సు దోచేస్తుంది. దాంతో వ‌ర్ష‌కు ఎంతో మంది అభిమానులు కూడా అయ్యారు. ఇక ముందు ముందు ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఏవిధంగా ఉంటుందో చూడాలి.

Also Read: బ‌జ‌ర్ద‌స్త్ న‌రేష్ వ‌య‌స్సు ఎంతో తెలుసా..?

Visitors Are Also Reading