Home » జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ కు తీవ్ర అనారోగ్యం…అండ‌గా నిలిచిన జ‌బ‌ర్ద‌స్త్ టీమ్..!

జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ కు తీవ్ర అనారోగ్యం…అండ‌గా నిలిచిన జ‌బ‌ర్ద‌స్త్ టీమ్..!

by AJAY
Ad

జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ వినోద్ అంటే చాలా మంది గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. కానీ వినోదిని అంటే మాత్రం గుర్తు ప‌ట్ట‌ని ప్రేక్ష‌కులు ఉండ‌రేమో. హైప‌ర్ ఆది, చ‌మ్మ‌క్ చంద్ర టీమ్ ల‌లో లేడీ గెట‌ప్ లు వేస్తూ వినోద్ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఆరడుగు ఎత్తు చూడ్డానికి అచ్చం అమ్మాయిలా క‌నిపించే వినోద్ కు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. అంతే కాకుండా కామెడీ టైమింగ్ లోనూ వినోద్ త‌న టాలెంట్ నిరూపించుకున్నాడు.

Advertisement

జ‌బ‌ర్ద‌స్త్ లో వేల స్కిట్ ల‌లో న‌టించిన వినోద్ ఆ త‌ర‌వాత ప‌లు టీవీ షోల‌లో సంద‌డి చేశాడు. అయితే వినోద్ కొంత కాలంగా టీవీ షోల‌కు దూరంగా ఉంటున్నాడు. కానీ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో క‌నిపించి వినోద్ అంద‌రినీ షాక్ గురి చేశాడు. బేసిక్ గా వినోద్ చాలా అందంగా ఉంటాడు. కానీ తాజా ఇంట‌ర్వ్యూలో మాత్రం బ‌క్క‌చిక్కిపోయి..జుట్టు ఊడిపోయి క‌నిపించాడు. అంతేకాకుండా వినోద్ త‌న ఆరోగ్యం అస్స‌లు బాగాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Advertisement

త‌నకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చింద‌ని వినోద్ తెలిపాడు. జంక్ ఫుడ్ తిన‌డం….ఎక్కువ‌గా జ‌ర్నీ చేయ‌డం లాంటివి చేయ‌డం వ‌ల్ల అలా జరిగింద‌ని డాక్ట‌ర్ లు చెప్పార‌ని తెలిపాడు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వ‌ల్ల ఆస్ప‌త్రిలో చేరిన త‌ర‌వాత న‌డ‌వ‌లేని ప‌రిస్థితికి వెళ్లిపోయాన‌ని చెప్పారు. ఇక ప్ర‌స్తుతం తాను కోలుకుంటున్నాన‌ని అన్నాడు.

అంతే కాకుండా త‌న‌కు జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ స‌భ్య‌లు ఆది, సుధీర్, చంద్ర సాయం చేశార‌ని చెప్పాడు. తాను ఆర్థికంగా కూడా ఇబ్బందులు ప‌డ్డాన‌ని చెప్పాడు. ఓ ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఆ ఇంటి ఓన‌ర్ మోసం చేశాడ‌ని చెప్పాడు. అంతే కాకుండా ఆస్ప‌త్రి ఖ‌ర్చుల కోసం కూడా చాలా ఖ‌ర్చు అయ్యింద‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం వినోద్ తాను కోలుకుంటున్నాన‌ని త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మ‌ళ్లీ న‌వ్విస్తాన‌ని చెప్పాడు.

ALSO READ :  వారిని నమ్మి రూ. 21 లక్షలు పోగొట్టుకున్న జబర్ధస్థ్ వినోద్..నరకయాతనలో కమెడియన్ !

Visitors Are Also Reading