Home » వారిని నమ్మి రూ. 21 లక్షలు పోగొట్టుకున్న జబర్ధస్థ్ వినోద్..నరకయాతనలో కమెడియన్ !

వారిని నమ్మి రూ. 21 లక్షలు పోగొట్టుకున్న జబర్ధస్థ్ వినోద్..నరకయాతనలో కమెడియన్ !

by Bunty
Ad

జబర్దస్త్ షో తో పాపులర్ అయిన కమెడియన్లలో వినోద్ కూడా ఒకరు. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వినోద్ కి సెట్ అయినంతగా మరే కమెడియన్ కి సెట్ కాలేదు. జబర్దస్త్ షోలో వినోద్ అందమైన అమ్మాయి గెటప్స్ లో కనిపిస్తూ కడుపుబ్బ నవ్వించిన అనేక స్కిట్ లు ఉన్నాయి. చమ్మక్ చంద్రతో కలిసి వినోద్ ఎన్నో స్కిట్స్ లో నవ్వులు పూయించారు. అయితే ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ వినోద్… తను  దాచుకున్న మొత్తం డబ్బులు లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

 

Advertisement

సొంతంగా ఇల్లు కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తికి రూ. 13 లక్షలు ఇచ్చే మోసపోయానని అన్నారు. ఇల్లు కొనేందుకు ఇంటి యజమానితో ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్స్ గా రూ. 13 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. నోటిమాట ద్వారా రూ. 3 లక్షలు, లిఖితపూర్వకంగా రూ. 10 లక్షలు ఇచ్చానని అన్నారు. అయితే సదరు వ్యక్తి వినోద్ ను వేధిస్తుండడంతో పాటు డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదని, గతేడాది కాలంగా తిరుగుతున్న తనకు న్యాయం దొరకలేదని అన్నారు.

Advertisement

అలాగే మరో వ్యక్తిని నమ్మి 5 లక్షలు కోల్పోయారట. తెలిసిన వ్యక్తికి ఎవరో అప్పు ఇస్తే, గ్యారెంటీగా వినోద్ ఉన్నారు. ఇద్దరి మధ్య షూరిటీ ఇవ్వడం వల్ల తాను రూ. 5 లక్షలు అప్పు చెల్లించాలని, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మరో రూ. 3 లక్షలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఊపిరితిత్తుల్లోకి నీరు రావడంతో సన్నగా అయ్యానని, ట్రీట్మెంట్ ఖర్చులు కలిపి మొత్తం రూ.3లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అన్నారు. అలా తన జీవితంలో ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని సంపాదించుకున్న ఆస్తి రూ. 21 లక్షల వరకు కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

read also : 2022లో ఆకస్మికంగా మరణించిన టాలీవుడ్ ప్రముఖులు..

 

Visitors Are Also Reading