Home » ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే ?

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే ?

by Anji

itlu maredumilli niyojakavargam Box Office collection: అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ ఈ సినిమా కథ విషయానికొస్తే.. తెలుగు ఉపాధ్యాయుడు (అల్లరి నరేష్) శ్రీనివాస్ శ్రీపాద. అన్యాయాలను సహించని మనస్థత్వం కలవాడు. రంపచోడవరం ఉప ఎన్నికల కోసం మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మారేడుమిల్లి గ్రామంలో విధులను నిర్వహించాల్సి వస్తుంది. ప్రధానంగా అక్కడ 100 శాతం పోలింగ్ జరగాలని కలెక్టర్ (సంపత్ రాజ్) ఆదేశిస్తారు. దీంతో ఇంగ్లీషు టీచర్ అయినటువంటి వెన్నెల కిషోర్ తో కలిసి మారేడుమిల్లి గ్రామానికి చేరుకుంటాడు అల్లరి నరేష్.  అక్కడ 100 శాతం పోలింగ్ జరిగిందా లేదా..? మారేడుమిల్లి గ్రామస్తుల డిమాండ్ ఏంటి..? వారి డిమాండ్లు నెరవేరాయా లేదా అన్నది కథ. 

ఏఆర్ మోహన్ దర్శకత్వంలో నవంబర్ 25న విడుదలైన ఈ సినిమాకి యావరేజ్ టాక్ వినిపించింది.  ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. మొదటి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక  వీకెండ్ లోనైనా కలెక్షన్లు బాగుంటాయని ఎదురుచూశారు. కానీ సమయంలో కూడా కలెక్షన్లు అంతగా రాలేదు. టీజర్, ట్రైలర్ బాగున్నప్పటికీ ఎందుకో ఈ సినిమాపై మొదటి నుంచే హైప్ క్రియేట్ అవ్వలేదు. ఇక ప్రమోషన్లు కూడా అంతంత మాత్రంగానే జరిగాయి. జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్ పై రాజేష్ దండా ఈ సినిమాని నిర్మించారు. అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు నటించారు. కెమెరా రాంరెడ్డి, సంగీతం శ్రీచరణ్ పాకాల, సంభాషణలు అబ్బూరి రవి అందించారు. 

Manam News

తొలి నాలుగు రోజులకు రూ.2.84 కోట్ల గ్రాస్  వసూలు చేసింది.  ఈ చిత్రం  రూ.3.65 కోట్ల బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4కోట్లు నమోదు అయింది.  నాలుగు రోజుల్లో 1.43 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. అంటే ఇంకా రూ.2.57 కోట్ల షేర్ రాబడితేనే ఈ సినిమా హిట్ గా నిలుస్తుంది. ఈ టార్గెట్ రీచ్ అవ్వడం కాస్త  కష్టమే అనిపిస్తోంది. 5, 6 రోజుల్లో రోజుకు  రూ.10లక్షలలోపు వసూలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. పూర్తి రన్నింగ్ టూమ్ లో టార్గెట్ ని రీచ్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి మరి. 

 

Visitors Are Also Reading