Telugu News » Blog » మిర్చి విల్లన్ ‘సంపత్ రాజ్’ ని భయపెట్టిన కర్నూలు కుర్రాళ్ళు ఎందుకు? ఎక్కడంటే ?

మిర్చి విల్లన్ ‘సంపత్ రాజ్’ ని భయపెట్టిన కర్నూలు కుర్రాళ్ళు ఎందుకు? ఎక్కడంటే ?

by Anji
Ads

విల‌న్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు సంప‌త్‌రాజ్ త‌మిళంలో సుమారు 50కి పైగా సినిమాల్లో న‌టించిన త‌రువాత‌నే తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ పంజా, ఎన్టీఆర్ ద‌మ్ము సినిమాలో న‌టించారు. కానీ సంప‌త్‌కు మంచి గుర్తింపును ఇచ్చిన చిత్రం మిర్చి. ఈ సినిమాకు ఉత్త‌మ విల‌న్‌గా సంప‌త్‌ నంది అవార్డు అందుకున్నారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డంల‌లో ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ ఆర్టీస్టుగా మారిపోయారు.

Tollywood Noted Villain's Daughter Wants to Marry Mahesh Babu!

క‌రుడు గ‌ట్టిన విల‌న్ అయినా.. ఎమోష‌న‌ల్ పాత్ర‌ల‌యినా.. కామెడీ రోల్స్ అయినా సంప‌త్ అద‌ర‌గొట్టేస్తుంటారు. తాజాగా సంప‌త్ అలీతో స‌ర‌దా షోకి గెస్ట్‌గా వ‌చ్చాడు. జ‌న‌వ‌రి 31,2022 రోజు ప్ర‌సారం కానున్న ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుద‌ల చేసారు. ఐటం సాంగ్ కు లేడీస్ పెడుతారు. కానీ ఈ ముఖ్యంగా ఈ ఎపిసోడ్ చూసిన త‌రువాత మీరు చేస్తే బాగుంటుంద‌ని పించింది అని అలీ అడ‌గ‌గా.. అందుకు సంప‌త్ ప్లీజ్ రిక‌మెండ్ చేస్తే ఆ త‌రువాత చేయ‌డానికి నేను సిద్దం అని స‌మాధానం ఇచ్చాడు.

Villian Sampath Shares Heart-warming Divorce Story - Lovely Telugu

ఒక‌సారి శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో న‌లుగురు ప్రేమ‌, అభిమానంతోటి బాగా భ‌య‌పెట్టించార‌ట‌. నిజ‌మేనా అలీ అడ‌గ‌గా.. మిర్చి సినిమా విడుద‌ల అయింది. అప్ప‌ట్లో పెద్ద హిట్ సాధించింది. కుర్రాడు ఇలా వ‌చ్చి.. సార్ మ‌నోడు సారు.. ఓయ్ రారా.. తీయ్ రా.. అని అలా బిర్రుగా ప‌ట్టుకున్నాడు. నేను అత‌ని వైపు ఆశ్చ‌ర్యంగా చూస్తున్నాను. మా డ్రైవ‌ర్‌తో అడిగాను వారి గురించి.. త‌ప్ప‌కుండా వారు క‌ర్నూలు వైపు వాళ్లే ఉంటారు సార్‌. వాస్త‌వానికి వారిదంతా క‌ర్నూలు కావ‌డం విశేషం.

Married to actress Saranya for 23 years .. Divorce: 'Mirchi' villain Sampath  Secrets » Jsnewstimes

అదేవిధంగా ఆర్టీస్ట్ శ‌ర‌ణ్య మీ మాజీ వైఫ్ అని అంటున్నారు.? శ‌ర‌ణ్య నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌. మా పిల్ల‌లు, వాళ్ల పిల్ల‌లు , మా కుటుంబం వారి కుటుంబం. వాళ్ల భ‌ర్త కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్‌. అయితే మేము ఇద్ద‌రం క‌లిసి ఓ సినిమాలో భార్య‌, భ‌ర్త‌లుగా క‌లిసి న‌టించాం. ఓ ఫోటో పెట్టి నా మాజీ భార్య అని రాసారు. అందులో నిజం లేదు అని స్ప‌ష్టం చేశారు సంప‌త్‌. మ‌రోవైపు సినిమా ఇండ‌స్ట్రీలో మీ కుటుంబం నుంచి కేవ‌లం సంప‌త్ ఒక్క‌డేనా..? మ‌రెవ‌ర‌న్నా ఉన్నారా అని అలీ అడ‌గ‌గా.. సంప‌త్ ఎవ్వ‌రూ లేరు అని స‌మాధానం చెప్పాడు. ముఖ్యంగా మా అమ్మ దృష్టిలో సినిమా అంటే చ‌దువు లేని వాడు , ప‌ని పాట లేని వాడే సినిమాల్లోకి వెళ్లుతాడు అని చెప్పింది. మీ అమ్మ‌తో భ‌య‌ప‌డి ఉంటే నువ్వు సినిమాల్లోకి వెళ్ల‌వు. నువ్వు పారిపో అని స‌ల‌హా కూడా ఇచ్చాడ‌ని గుర్తు చేశారు.


You may also like