Home » స‌మంత అస్స‌లు త‌గ్గ‌డం లేదుగా…. ఇంత‌క‌న్నా సాక్ష్యం ఏముంటుంది..!

స‌మంత అస్స‌లు త‌గ్గ‌డం లేదుగా…. ఇంత‌క‌న్నా సాక్ష్యం ఏముంటుంది..!

by Bunty
Ad

అక్కినేని నాగార్జున త‌న‌యుడు యువ‌హీరో నాగ‌చైత‌న్య‌తో విడాకులు ప్ర‌క‌టించిన త‌రువాత సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా స‌మంత వ‌రుస‌పెట్టి క్రేజీ ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతూ ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన శాకుంతలం సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన పుష్ప ది రైజ్ సినిమాలో కుర్ర‌కారును ఆక‌ట్టుకునేందుకు ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మామ అనే ఐటెం సాంగ్ లో నటించిన సమంత నానా ర‌చ్చ చేసింది. ఈ పాట‌లో స‌మంత స్టిల్స్‌, మూమెంట్స్ చూసిన వారు అస‌లు ఆమె త‌న‌కు పెళ్ల‌యింద‌నే విష‌యాన్ని కూడా పూర్తిగా మ‌ర్చిపోయింద‌ని కామెంట్లు చేస్తున్నారు.

 

Advertisement

విడాకుల తర్వాత తాను అసలు ఏమాత్రం తగ్గని ఇప్పటికే నిరూపించుకున్న సమంత, ఐటమ్ సాంగ్ లో మరింతగా రెచ్చిపోయింది. అందాలు ఆరబోసే విషయంలో సమంత ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. ఇప్పటివరకు సౌత్ సినిమాలపై ప్రధానంగా కాన్సన్‌ట్రేష‌న్ చేసిన సమంత ఇప్పుడు బాలీవుడ్‌పై కన్నేసింది. బాలీవుడ్ లో ఛాన్స్ వస్తే చాలు బోల్డ్‌ పాత్రల‌లో అయినా నటించేందుకు ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

Advertisement

 

ఇప్పటికే రెండు బైలింగ్వుల్ మూవీస్‌తో పాటు ఒక సినిమా ప్రాజెక్టుకు ఓకే చెప్పిన సమంత… ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స‌మంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌సీరిస్‌తోనే డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు అమోజాన్ ప్రైమ్ కోసం రాజ్ – డీకే రూపొందించే యాక్ష‌న్ ప్యాక్డ్ సీరిస్‌లో న‌టించేందుకు ఆమె ఓకే చెప్పింద‌ట‌. బాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో వ‌రుణ్ ధావ‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. వ‌రుణ్ – స‌మంత క‌లిసి తొలిసారిగా న‌టిస్తోన్న ప్రాజెక్ట్ ఇదే కావ‌డం విశేషం. ఈ వెబ్‌సీరిస్‌లో స‌మంత‌, వ‌రుణ్ గూఢ‌చారులుగా క‌నిపించ‌నున్నార‌ట‌. కాస్త బోల్డ్‌గా కూడా స‌మంత పాత్ర ఉంటుంద‌ని చెబుతున్నారు. ఏదేమైనా విడాకుల త‌ర్వాత స‌మంత అటు వెండితెర‌తో పాటు ఇటు బుల్లితెర‌పై కూడా త‌న ర‌చ్చ ఆపేలా లేద‌నే చెప్ప‌వ‌చ్చు.

Visitors Are Also Reading