Home » రాఘవేంద్రరావు పాటల్లో పండ్లు, పూలు వాడటం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?

రాఘవేంద్రరావు పాటల్లో పండ్లు, పూలు వాడటం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. ఆయన సినిమా అంటేనే ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తప్పనిసరిగా ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రతి సాంగులో హీరోయిన్ల నడుముపై, ఇతర భాగాలపై పండ్లు, పూలు పడే సీన్లను పెడుతూ ఉంటారు.

Advertisement

దీనికి కారణం ఏంటో చాలామందికి తెలియదు. మరి అలాంటి సీన్లు ఎందుకు పెడతారో ఒక ఇంటర్వ్యూలో సీక్రెట్ బయటపెట్టారు రాఘవేంద్రరావు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు డైరెక్షన్ చేసిన చిత్రాలు ఎంత గొప్ప విజయం సాధిస్తాయో మనందరికీ తెలుసు.

Also Read:పెళ్లయి 5 నెళ్లు కాలేదు.. అంతలోనే అనంత లోకాలకు.. అంత దారుణం జరిగిందా..?

హీరోయిన్లను గ్లామరస్ గా చూపించడంలో ఈ దర్శకున్ని మించిన వారు లేరని చెప్పవచ్చు. భక్తి రస చిత్రాలైన కమర్షియల్ సినిమాలైన ఈయనకి ఈయనే సాటి. తన 48 సంవత్సరాల కెరియర్ లో ఎంతోమంది హీరో హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు. ఇక ముందుగా ఆయన సినిమాలు అంటే చాలామందికి గుర్తుకువచ్చేది పాటలు. పాటలను చాలా అందంగా తీర్చిదిద్దుతారు రాఘవేంద్రరావు. ముఖ్యంగా హీరోయిన్ల నాభిపై పూలు, పండ్లు కురిపించడంలో దిట్ట.

Advertisement

Also Read:Adipurush : ఆది పురుష్ కు అరుదైన గౌరవం…

ఈయన సినిమా పాటలలో దానిమ్మ, ద్రాక్ష,బత్తాయి, యాపిల్, నేరేడు,పండ్లు వంటి వాటితో ప్రయోగాలు చేస్తారు. ఇక పూల విషయానికి చామంతి, బంతి,గులాబి, మల్లెపూలు వంటి వాటిని వాడుతారు. అయితే ఆయన తన 30 సినిమాల వరకు ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. కానీ ఆ తర్వాత విజయశాంతిపై మొదటిసారిగా పూల ప్రయోగం చేసి సక్సెస్ అవడంతో ఇక అప్పటినుంచి ఈ కాన్సెప్ట్ కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఎందుకు కొనసాగిస్తారని ఆయనను అడిగితే ఈ ప్రకృతిలో అందమైన వారు స్త్రీలు, పూలు,పండ్లు మాత్రమే. అందుకే నా సినిమాల్లో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.

Also Read:మీ ఇంట్లో ఈ మొక్కలను అస్సలు పెంచకండి.. మీకు నష్టం పక్కా !

Visitors Are Also Reading